చిదంబరం విచారణకు సిబిఐకి అనుమతి

 

న్యూఢిల్లీ,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): ఎయిర్‌సెల్‌- మ్యాక్సిస్‌ కుంభకోణం కేసులో.. మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరంను విచారించేందుకు కావాల్సిన అనుమతులను పొందినట్లు ఇవాళ సీబీఐ వెల్లడించింది. ఢిల్లీ కోర్టులో ఈ విషయాన్ని సీబీఐ పేర్కొన్నది. ఎయిర్‌సెల్‌ మ్యాక్సిస్‌ కేసులో చిదంబరంను విచారించేందుకు కావాల్సిన అనుమతులను సంబంధిత అధికారుల నుంచి పొందినట్లు దర్యాప్తు సంస్థ వెల్లడించింది. అయితే ఈ కేసులో చిదంబరంను, ఆయన కుమారుడు కార్తీని అరెస్టు చేయరాదు అంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను డిసెంబర్‌ 18 వరకు కోర్టు పొడుగించింది. ఎయిర్‌సెల్‌ మ్యాక్సిస్‌ కేసులో విదేశీ నిధులు గురించి సీబీఐ విచారించగా, ఇదే కేసులోని మనీల్యాండరింగ్‌ అంశాన్ని ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఎయిర్‌సెల్‌ మ్యాక్సిస్‌ కేసులో విదేశాల్లో ఉన్న అకౌంట్లను మాజీ మంత్రి, ఆయన కుమారుడు మూసివేసినట్లు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని ఇవాళ సీబీఐ కోర్టు ముందు పేర్కొన్నది.