చిన్న పిల్లలమన్నా వినిపించుకోలేదు

వాషింగ్టన్‌ : అఫ్గనిస్థాన్‌లో సుమారు 16 మంది పౌరులను ఊచకోత కోసిన కేసులో వారి పిల్లలు సాక్ష్యం ఇచ్చారు. జాయింట్‌ బేస్‌ లెనిస్‌-మైక్‌ కార్డు సైనికస్థావరం వద్ద ఈ సాక్ష్యాలను రికార్డు చేశార. పిల్లలు అఫ్గనిస్థాన్‌ వీడి రాలేదు. కాబట్టి వీడియో కాన్ఫరెన్స్‌ంగ్‌ ద్వారా వారి సాక్ష్యాలను సేకరించారు. ఈ ఘాతుకం ఎలా జరిగిందీ వారు వైనంగా వివరించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న అమెరికన్‌ స్ఠాఫ్‌ సెర్జెంట్‌ రాబర్ట్‌ బేల్‌ ముఖంలో ఎలాంటి భావాలు వ్యక్తం కాలేదు. స్టేషన్లలో పిల్లల స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. ఈ కార్యక్రమం ముగిసింది. ఇక లెనిస్‌ సైనిక స్థావరంలోని దర్యాప్తు అధికారి బేల్స్‌ను సైనిక న్యాయస్థానం నిబంధనల మేరకు శిక్షించాలా లేదా అనేది నిర్ధారిస్తారు. నేర నిర్ధారణ జరిగితే బేల్స్‌కు మరణదండన విధించవచ్చు. సైనిక నేర దర్యాప్తు అధికారి ఒకరు సాక్ష్యమిస్తూ తన దర్యాప్తులో ఇద్దరు హంతకులకు ఇందులో ప్రమేయం ఉన్నట్లు తెలిసిందన్నారు. ఒక ఇంటిలో ఇద్దరు అగంతకులు ప్రవేశించి ఆ గృహిణిని పట్టుకోగా మరొకరు ఆమె భర్తపై కాల్పులు జరిపినట్లు తన విచారణలో వెల్లడించారు. కాని ఇతర ప్రత్యక్ష సాక్షుల ప్రకారం ఒక్కడే సామూహిక ఊచకోతకు పాల్పడ్డాడని నిఘా కెమెరాలు రికార్డు చేశాయి. ఇస్లామిక్‌ సంప్రదాయం ప్రకారం మృదదేహాలను ఖననం చేశారు. పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించలేదు. అందువల్ల మరణించిన వారి సంఖ్య తెలుసుకునేందుకు ఫోరెన్సిక్‌ సాక్ష్యాలు లభించలేదు.