చెరువులను దళారులకు అప్పగించే కుట్ర
జివో 217పై మండిపడ్డ మాజీమంత్రి కొల్లు రవీంద్ర
విజయవాడ,అక్టోబర్11 (జనంసాక్షి): మత్స్యకారులను రెచ్చగొట్టేలా జీవో నెంబర్ 217 ఉందని టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ భవిష్యత్తులో దళారులను ప్రోత్సహించేలా జీవో నెం. 217 ఉందన్నారు. ఆన్‌లైన్ టెండర్ విధానంతో చెరువులను దళారులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జీవో రద్దు చేయాలని వినతి పత్రాలు ఇచ్చినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. మత్స్యకార సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి జీవో రద్దుకు ఉద్యమించాలని నిర్ణయించాయన్నారు. మత్స్యకారుల సంఘాలకు టీడీపీ అండగా ఉంటుందని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ªూజీ ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 217ను రద్దు చేయాలని మత్స్యకార సహకార సంఘాలు కోరాయన్నారు. జీవో రద్దు చేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా లేఖ రాసినా.. కలెక్టరేట్లలో వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేదని, అందుకే ప్రభుత్వం స్పందించేలా కార్యాచరణ రూపొందిస్తామని కొండబాబు అన్నారు.