చెరువులలో చేపలపై బెస్త కులానికే తొలి హక్కు కావాలి…… డిమాండ్ చేసిన గంగపుత్ర సంఘం రాష్ట్ర నాయకులు..
సికింద్రాబాద్ సీతాఫలమండి లో తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర బెస్త సంఘం రాష్ట్ర కమిటీ కార్యవర్గ సమావేశం అయ్యింది. తెలంగాణ ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ ఎల్ మల్లయ్య మాట్లాడుతూ నేడు గంగపుత్రలకు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో తీరని అన్యాయం జరుగుతుందని మీడియా ముఖంగా తెలిపారు . ఆనాడు టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భించిన రోజు స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గంగపుత్ర బెస్తా కులస్తులు రాష్ట్రంలో జీవనోపాధి లేక దుబాయ్, మస్కట్ విదేశాలకు వెళుతున్నారు అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గంగపుత్ర బెస్తా కులస్తులకు చాపలు పట్టే వృత్తిని మొదటి హక్కు వాళ్ళకి కల్పిస్తానని హామీ ఇచ్చారు. కాని నేడు అ హామీని మార్చారు . 80 శాతం ఉన్న ముదిరాజుల కులస్తుల ఓట్ల కోసం కక్కుర్తి పడి చేపలు పట్టే వృత్తిని మొదటి హక్కు వాళ్ళకి కల్పించారు . దీనివల్ల 20 శాతం ఉన్న బెస్త కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రెండు సంవత్సరాల తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి మత్స్య శాఖ మంత్రిగా పనిచేసి మా గంగపుత్ర కులస్తులకు దేవుని లాగా పనిచేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు . కానీ మత్స్య శాఖ మంత్రి పదవిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అప్పగించడం వల్ల ఓట్ల కోసం అప్పుడున్న మంత్రి ఈటెల రాజేందర్ తో కలిసి ముదిరాజ్ కులస్తులకు ప్రాధాన్యతిస్తూ గంగపుత్రు కులస్తులను అణగదొక్కుతున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించి, గంగపుత్ర బెస్త వర్గానికి చెందిన నాయకునికి మత్స శాఖా మంత్రి పదవిని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 2015 మహబూబ్ నగర్ జిల్లాలో 600 మంది ముదిరాజులు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలలో చేరారని ప్రభుత్వ ప్రకటించింది. 7 సంవత్సరాలు వారి పై చర్య తీసుకోలేదు. వారి వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కెసిఆర్ కలుగజేసుకొని గంగపుత్ర బెస్త కులస్తులకు నిజమైన మత్సకారులు గుర్తించి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర సంఘం నుండి మీకు కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ గంధప శ్రీహరి , వీరన్న, ట్రెజరర్ , మల్లేష్, స్టేట్ సెక్రటరీ కొమురయ్య , కార్యవర్గ సభ్యులు, కుల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.