చెరువుల ఆక్రమణలను వదిలేది లేదు
తెలంగాణ వ్యాప్తంగా గుర్తించి చర్యలు
ఆధారాలతో ఎవ్వరైనా ఫిర్యాదు చేయొచ్చు
హైడ్రా చర్యలను సమర్థించిన మంత్రి పొన్నం
హైదరాబాద్,ఆగస్ట్26 (జనం సాక్షి): గ్రేటర్ హైదరాబాద్‌పరిధిలో హైడ్రా చేపట్టిన అక్రమ కట్టడాల కూల్చివేతల పై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. ముందు రాజధాని నగరంలో, తరువాత అన్ని జిల్లాల్లో చెరువులు ఆక్రమణకు గురయ్యాయో వివరాలు సేకరించి వాటిని పునరుద్ధరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. భౌగోళిక పరిస్థితుల్లో వాతావరణ కాలుష్యం నుండి వాతావరణాన్ని పరిరక్షించుకోవడానికి, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి గతంలో ఉన్న చెరువులకు ప్రభుత్వ లెక్కలకు రికార్డులకు అనుగుణంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా చెరువుల పరిరక్షించుకోవాలని స్వచ్ఛంద సంస్థలకు, గతంలో ఇక్కడ చెరువు ఉండే అని తెలిసిన వారు స్థానికులు ఎవరైనా పోలీసు, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే పని.. చెరువుల పరిరక్షణ స్థానికులదేనని అన్నారు. ప్రభుత్వానికి ఎవరి విూద రాజకీయ కక్ష సాధింపు లేదని తేల్చి చెప్పారు. హైడ్రాకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుంది.. ప్రభుత్వం చేస్తున్న పనిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు హర్శిస్తున్నారన్నారు. ఎవరికైనా అన్యాయం జరిగింది అంటే న్యాయ స్థానాలు ఉన్నాయని అన్నారు. చెరువుల పరిరక్షకులు అందరూ ఎక్కడెక్కడ అక్రమణకు గురయ్యాయో వాటి ఆధారాలు సంబంధిత అధికారులకు ఇవ్వాలన సూచించారు. 33 జిల్లాల్లో ఎక్కడైనా గ్రామాలు, మండలాలు,పట్టణాలు, మున్సిపాలిటీ చెరువులు ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాల్లో విూకు ఉన్న అవగాహన, ఆలోచనను
ప్రభుత్వం దృష్టికి తీసుకురండని పిలుపునిచ్చారు. ప్రజలంతా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.