చైనా రాజకీయ ఎత్తుగడు

పాక్‌, నేపాల్‌ను ఎగదోస్తూ వ్యూహాు
సరిహద్దు వివాదాల్లో మునిగేలా డ్రాగన్‌ చిచ్చు
న్యూఢల్లీి,జూన్‌18(జ‌నంసాక్షి):చైనా కుత్సిత బుద్దితో నేపాల్‌ను కూడా తన అవసరాకు సమిధగా వాడుకుంటోంది. భారత్‌ నేపాల్‌ మధ్య సరిహద్దు వివాద చిచ్చు పెట్టి ఆనందిస్తోంది. ఇటీవ నేపాల్‌ కొత్త మ్యాప్‌ను ఆమోదించడం, భారత్‌ను ఎదరించి మాట్లాడడం చూస్తే నేపాల్‌ ఎంతగా చైనా ఉచ్చులో పడిరదో గమనించ వచ్చు. అక్కడ ఉదారవాద కమ్యూనిస్టు అధికార పగ్గాు చేపట్టిన తరవాత జరిగిన పరిణమాంగా దీనిని గుర్తించాలి. నేపాల్‌ రాజకీయ మ్యాపులో మార్పుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బ్లిును ఆ దేశ పార్లమెంటు ప్రతినిధు సభ ఇటీవ ఏకగ్రీవంగా ఆమోదించడంతో చిరకా మిత్ర దేశా మధ్య వివాదం రాజుకునేలా చేయడంలో చైనా విజయం సాధించింది. భారత్‌ భూభాగాకు చెందిన కాలాపాని, లిపులేఖ్‌, లింపియాధురా ప్రాంతాను కొత్త మ్యాపులో నేపాల్‌ చేర్చడం ద్వారా భారత్‌తో కయ్యానికి సై అంది. దీనికి కొనసాగింపుగా ఇటీవలే బీహార్‌లో ఓ సరిహద్దు గ్రామంలో దాడిచేసి రైతును చితకబాదింది. ఓ రైతు మృతికి కారణమయ్యింది. 2019 ఆగస్టు 5న జమ్మూకాశ్మీర్‌ను పునర్విభజన చేస్తూ భారత్‌ కొత్త రాజకీయ మ్యాపు విడుద చేసినందుకు ప్రతిగా నేపాల్‌ ఈ చర్యకు పూనుకుంది. ఈ మూడు వివాదాస్పద ప్రాంతాపై హక్కు తమకు ఉందంటూ నేపాల్‌ ప్రకటించడం వెనక చైనా ఉందన్నది నిర్వివాదం. దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి (సార్క్‌)లో సభ్యదేశాుగా ఉన్న ఈ రెండు
ఇరుగుపొరుగు దేశా మధ్య వాణిజ్య, సహకార విస్తరణకు ఒప్పందాు ఉన్నాయి. కానీ, సరిహద్దు వివాదా పరిష్కారానికి ఎలాంటి ఒప్పందమూ లేదు. రాజకీయ మ్యాపుపై వివాదం మొదలై ఎనిమిది మాసాు గడిచినా, దీనిపై భారత్‌, నేపాల్‌ మధ్య ఒక్కసారి కూడా చర్చు జరగలేదు. రెండు సార్లు తాము చర్చ తేదీను ప్రతిపాదించినా భారత్‌ పట్టించుకోలేదని నేపాల్‌ అంటోంది. నేపాల్‌తో చర్చు, సంప్రదింపుకు తాము సుముఖంగానే ఉన్నామని, నేపాల్‌ పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బ్లిు పెట్టడానికి ముందు కూడా చర్చ ప్రతిపాదన చేశామని, ప్రధాని ఓలి ఏకపక్ష ధోరణెళి ఈ వివాదానికి కారణమని మోడీ ప్రభుత్వం ఆరోపించింది. ఇరు దేశా మధ్య అపోహు, అనుమానాు ఏవైనా తలెత్తినప్పుడు ఉభయ దేశా నేతు పరస్పరం చర్చించుకుని, పరిష్కరించు కోవాని 1950 నాటి ఒప్పందం స్పష్టంగా చెబుతోంది. అయితే చైనా అండగతో నేపాల్‌ కూడా తోక జాడిస్తోంది. భారత్‌తో పోల్చితే నేపాల్‌ చాలా చిన్న దేశం. ఆర్థికంగా కూడా బహీనమైన దేశం. వివిధ రంగాల్లో భారత్‌పైనే బాగా ఆధారపడి జీవిస్తోంది. శాంతి స్నేహ ఒప్పందం తరువాత రెండు దేశా ప్రజ మధ్య ప్రత్యేక బాంధవ్యం ఏర్పడిరది. భారత్‌లో 80 క్ష మంది నేపాలీయు నివసిస్తుండగా, నేపాల్‌లోని తెరాయిలో 40 క్ష మంది దాకా భారత్‌ నుంచి వస వెళ్లి స్థిరపడినవారు ఉన్నారు. వీరికి నేపాల్‌ పౌరసత్వం కూడా భించింది. పాస్‌పోర్టు, వీసా అవసరం లేకుండానే రెండు దేశా మధ్య స్వేచ్ఛగా రాకపోకు సాగించుకునే మీంది. భారత్‌లో నివసించే నేపాలీయు ఇక్కడి పౌరుతో సమంగా విద్య, వైద్య సదుపాయాను పొందడంతో బాటు ప్రభుత్వ ఉద్యోగాు పొందే అవకాశం ఉంది. నేపాల్‌ వాణిజ్యంలో మూడోవంతు భారత్‌పై ఆధారపడి ఉంది. రెండు దేశా మధ్య బంధం విడదీయరానిది. ఈ నేపథ్యంలో కాలాపానీ, లిపులేఖ్‌, లింపియాధురా ప్రాంతాను భారత్‌ తన అధీనంలోని భూ భాగంగా పేర్కొంటూ రాజకీయ మ్యాపును ప్రచురించడంతో ఇరు దేశా సంబంధాల్లో కొత్త దశ మొదలైంది. నేపాల్‌పై చైనా ప్రభావం పెరుగుతున్న క్రమంలోనే అది ఇలాంటి వివాదాను ముందుకు తెస్తోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతు ఇలాగే కొనసాగడం చైనాకు అవసరం. పాక్‌ సరిహద్దుల్లో, నేపాల్‌ సరిహద్దుల్లో వివాదాు సాగాని అది కోరకుంటోంది. అందుకే భారత్‌ తమపై దాడి చేయదన్న ధీమాతో చైనా ఉంది.