చేపల వ్యాధులపై శిక్షణ కార్యక్రమం

చేపల వ్యాధులపై శిక్షణ కార్యక్రమం

పి.వి.నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం,కృషి విజ్ఞాన కేంద్రం,మామునూరు వారి ఆధ్వర్యంలో కోట వెంకటాపురం గ్రామం, సంగెం మండలం నందు చేపలలో వచ్చే వ్యాధుల నిర్ధారణ మరియు యాజమాన్యంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం, మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ .జి .గణేష్ చేపలలలో బ్యాక్టీరియా వల్ల కలుగు వ్యాధులైన డ్రాప్సీ, తోక తెగుళ్లు మరియు ఎరుపు వ్యాధి లక్షణాల గుర్తింపు మరియు నివారణ మార్గాల గురించి వివరించారు. అలాగే కోపిపొడ్, హెల్మన్థిస్ క్రీముల వలన చేపలలో సంభవించే వ్యాధులైన స్కిన్ ఫ్లుక్, గిల్ ఫ్లుక్, లెర్నియ మరియు చేప పెను వ్యాధుల గుర్తింపు లక్షణాలు, నివారణ పద్ధతుల గురించి రైతులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం తదనంతరం భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి వారి సౌజన్యంతో షెడ్యూల్ కులాల ఉప ప్రణాళికలో భాగంగా చేప పిల్లలను రైతులకు అందజేయడం జరిగింది మరియు చేప పిల్లలను ఏ విధంగా చెరువులలో వదలాలో క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం ,మత్స్య శాస్త్రవేత్త డాక్టర్. జి. గణేష్,ఈ సుదర్శన్, మత్స్య సహకార సొసైటీ అధ్యక్షులు మరియు కోట వెంకటాపురం గ్రామ రైతులు పాల్గొన్నారు.