చేర్యాలను రెవెన్యూ డివిజన్ సాధించేంతవరకు ఉద్యమం

సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా,వినతి
– సీపీఎం, సీపీఐ నేతలు ఆముదాల మల్లారెడ్డి, అందె అశోక్

చేర్యాల (జనంసాక్షి) జులై 05 : చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా సాధించేంతవరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ స్పష్టం చేశారు. మంగళవారం వామపక్షాల ఆధ్వర్యంలో చేర్యాల తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి గంటపాటు బైఠాయించారు. అనంతరం  తహశీల్దార్ ఎస్.కె ఆరిఫా కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చిట్ట చివర ప్రాంతం చేర్యాల ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని 261 నియోజకవర్గంగా ఉన్న చేర్యాలను నియోజకవర్గం రద్దు కావడంతో రోజురోజుకు చేర్యాల పరిస్థితి దిగజారి పోయిందని, నూతన జిల్లాల పునర్విభజనలో భాగంగా చేర్యాలను సిద్దిపేట జిల్లాలో కలిపారని, ఎంపీ భువనగిరి, కోర్టు, ఎమ్మెల్యే జనగామ, రెవెన్యూ డివిజన్ సిద్దిపేట, విద్యుత్ హుస్నాబాద్, వ్యవసాయ శాఖ గజ్వేల్ ఇన్ని రకాలుగా చేర్యాల ప్రాంతాన్ని కుక్కలు చింపిన విస్తారులాగా విభజించి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని అర్హతలు కలిగిన చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని వామపక్షాల ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ఈ ప్రాంత ప్రజల ఓట్లతో గెలిచిన అధికార పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకుండా  ప్రాంతానికి ద్రోహం చేస్తున్నారన్నారన్నారు. ఈ ప్రాంత ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, దూల్మిట్ట మండలాలను కలిపి చేర్యాల డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని, చేర్యాల పాత నియోజకవర్గాన్ని యధావిధిగా పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎమ్మెల్యేను, అధికార పార్టీ నేతలను ఈ ప్రాంతంలో తిరగనీయకుండా ప్రజల చేత గుణపాఠం తప్పదన్నారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తారో రాజీనామా చేస్తారో అధికార పార్టీ నేతలు తేల్చుకోవాలని సవాల్ విసిరారు. సీపీఐ,సిపిఎం ఆధ్వర్యంలో డివిజన్ సాధనకు మిలిటెంట్ తరహా పోరాటాన్ని ఉదృతం చేస్తామని, ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వామపక్షాల నాయకులు ఈరి భూమయ్య, బండకింద అరుణ్ కుమార్, రాళ్లబండి నాగరాజు, కుడిక్యాల బాల్ రాజు, పుల్లని వేణు, బండారి సిద్ధులు, గూడెపు సుదర్శన్, దాసరి ప్రశాంత్, పోలోజు శ్రీహరి, మోకు దేవేందర్ రెడ్డి,రాళ్లబండి భాస్కర్, గొర్రె శ్రీనివాస్, బోయిని మల్లేశం, నాగపూరి కనకయ్య, కందాల బాలు, కత్తుల భాస్కర్ రెడ్డి,సకినాల బాల్ రాజు, మేడిపల్లి చందు,బండారి కనకయ్య, రేపాక కుమార్,మ్యాక లింగం, వలబోజు నర్సింహా చారి, కొంగరి ప్రతాప్, ఆత్మకూరి హరిక్రిష్ణ, స్వర్గం శ్రీకాంత్,మనేపల్లి కిష్టయ్య, గూడెపు పెంటయ్య,సిద్దిరాం భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
Attachments area