చేర్యాల ప్రాంత ప్రజల చిరకాల కోరికను నెరవేర్చాలి

చేర్యాల ప్రాంత ప్రజల చిరకాల కోరికను నెరవేర్చాలి

చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 30: చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించి చేర్యాల ప్రాంత ప్రజల చిరకాల కోరికను నెరవేర్చాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు భూమిగారి మనోహర్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం చేర్యాల మండల కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న దీక్షలు 20వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో చేర్యాల ప్రాంత న్యాయవాదులు కూర్చున్నారు. వారికి జేఏసీ చైర్మన్ రామగళ్ల పరమేశ్వర్, కో చైర్మన్ పూర్మ ఆగం రెడ్డి లు పూలదండలు కండువా వేసి దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఘనమైన చరిత్ర కలిగిన చేర్యాల ఒకప్పుడు నియోజకవర్గంగా తాలూకా కేంద్రంగా ఉండి నేడు చిన్న మండలంగా కుదించబడి అస్తిత్వాన్ని కోల్పోయి కొన్ని మండలాలు హుస్నాబాద్, సిద్దిపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో కలిపి ఈ ప్రాంతాన్ని ముక్కలు చెక్కలు చేయడంతో ఎంతో నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. చేర్యాల ప్రాంత ప్రజల ఆకాంక్షను ఆత్మగౌరవాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించి వెంటనే రెవెన్యూ డివిజన్ ప్రకటన చేసి జీవో జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు. డివిజన్ సాధించేంతవరకు జేఏసీ నిర్వహిస్తున్న ఉద్యమానికి న్యాయవాదులు ముందుంటారని తెలిపారు. ఈ దీక్షలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తాటికొండ ప్రణీత్, సహాయ కార్యదర్శి పర్వతం రాములు, కోశాధికారి పొన్నం సురేష్ కృష్ణ, ఈసీ మెంబర్ కాటం సురేందర్, సీనియర్ న్యాయవాది బూరుగు యాదగిరి, గాజుల రవీందర్, కుర్రి తిరుమలేష్ కుమార్, దాసరి ప్రశాంత్, కడింగుల సౌమ్య, మెరుగు రాజు కూర్చోగా వారికి సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్ గౌడ్, కొంగరి వెంకట్ మావో, ఈరి భూమయ్య, బండకింది అరుణ్ కుమార్, బిజ్జ రాము, పోతుగంటి ప్రసాద్, మేరిండ్ల శ్రీనివాస్, దండ్యాల వెంకటరెడ్డి, కొంగరి వెంకట స్వామి, బోయిని మల్లేశం సంఘీభావం తెలిపారు.