చేర్యాల సీఐపై చర్యలు తీసుకోవాలని
బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బొంగోని సురేష్ గౌడ్
సీపీకి ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు
మద్దూరు (జనంసాక్షి) అక్టోబర్ 08 : అకారణంగా దాడి చేసిన చేర్యాల సిఐ శ్రీనివాస్ పై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని బీజేవైఎం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బొంగోని సురేష్ గౌడ్ కోరారు. మద్దూరు మండల కేంద్రంలోని తాజ్ ఫంక్షన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఓ గొడవ విషయంలో విచారణ కోసం శనివారం మద్దూరు పోలీస్ స్టేషన్ కి రావాలని సీఐ రమ్మంటున్నారని బిజెపి కార్యకర్త బస్వరాజు స్వామిని మద్దూరు పోలీసులు ఫోన్ చేయగా వెళ్లిన వెంటనే సీఐ చెప్పులు బయట విప్పి రార అంటూ బీజేవైఎం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బొంగోని సురేష్ గౌడ్, మద్దూరు మండల అధ్యక్షుడు యామా శ్రీకాంత్ ని బిజెపి కార్యకర్తల్ని నానా బూతులు తిడుతూ టీఆర్ఎస్ పార్టీ గురించి మరొకసారి వ్యతిరేకంగా మాట్లాడితే ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించి ఫోన్ లో ఎం రికార్డు చేస్తున్నావ్ రా అంటూ బలవంతంగా ఫోన్ గుంజుకోని బెల్టుతో చేతులపై ఇష్టం వచ్చినట్లు కొట్టడని ఆరోపించారు. గతంలో కూడా తెరాస నాయకులూ తమపై దాడి చేస్తే పిర్యాదు చేయటానికి వెళ్తే తెరాస వాళ్ళు రెండు వేల మంది వున్నారు వాళ్ళు మీ ఇండ్ల మీద పడి కొడితే మీకు ఎవడు రక్షణ కల్పిస్తారు రా అంటు బెదిరించినట్లు పేర్కొన్నారు. పూర్తిగా టిఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలాగా వ్యవహరిస్తూన్న సిఐపై చర్యలు తీసుకోవాలని సిపి కి పిర్యాదు చేసినట్లు తెలిపారు. రక్షణగా ఉండవలసిన పోలీసులే ఈ విధంగా ప్రవర్తిస్తే తాము ఎవరికి చెప్పుకోవాలని వాపోయారు. ఈ విధంగా మాట్లాడి బయబ్రంతులకు గురి చేసిన సీఐపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యదర్శి మనోజ్ కుమార్, బసవరాజు స్వామి,బొల్లు కృష్ణ, గొడుగు ప్రశాంత్, బొల్లు రాజు, ఏలూరు శివ కృష్ణ, కానకుంట్ల ప్రశాంత్, బాలకృష్ణ పైసా, రవి, కనకయ్య,చింతల చందు, రాకేష్ పటేల్, బైరి శ్రీకాంత్, బొడ్డు ప్రశాంత్, సుఖేష్ తదితరులు పాల్గొన్నారు.