ఛాతినొప్పి రావడంతో ఖైదీ మృతి
కాప్రా: హైదరాబాద్‌లోని చర్లపల్లి కేంద్ర కారాగారంలోని ఖైదీని ఆసుపత్రిని తరలిస్తుండగా మృతిచెందాడు. జైలు సూపరింటెండెంట్ కె.ఎల్, శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం పరిగికి చెందిన మంగళ కిష్టయ్య (60) కొట్లాట కేసులో నిందితుడు ఇది వరకు పరిగి జైలులో విచారణ ఖైదీగా ఉన్నాడు. అనారోగ్యంతో ఉన్న కారణంగా పరిగి జైలు అధికారులు ఆసుపత్రి సదుపాయం ఉన్న చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ ఉదయం ఆయనకు ఛాతినొప్పి రావడంతో అక్కడినుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కిష్టయ్య మృతిచెందినట్లు డాక్టర్లు ధృవీకరించారని సూపరింటెండెంట్ తెలిపారు.