ఛార్‌థామ్‌లో 190 కి చేరిన మృతుల సంఖ్య

డెహ్రాడూన్‌,(జనంసాక్షి): అధికారిక సమాచారం ప్రకారం ఛాఱ్‌థామ్‌ యాత్రలో 190 కి మృతుల సంఖ్య చేరింది. నేడు హరిద్వార్‌ సమీపంలో 40 మృతుదేహాలను భద్రతాసిబ్బంది వెలికితీసింది. 40 హెలికాప్టర్ల సాయంతో తొమ్మిది వేల మందిని భద్రతా సిబ్బంది రక్షించింది.
వరద వచ్చిన రోజు కేదర్‌నాథ్‌ ఆలయంలో ఏం జరిగిందో ఆ ఆలయ పూజరి దినేష్‌ భగ్వాడి ఓ ప్రైవేటు ఛానల్‌కు చెప్పారు. వరద వచ్చిన సమయంలో తాను ఆలయంలో ఉన్నానని తెలిపారు. 16వ తేదీద నుంచి వర్షం బాగా పెరిగిందన్నారు. వరద వచ్చిన రాత్రి నదిపై ఉన్న రెండు వంతెనలు కొట్టుకుపోయాయని పేర్కొన్నారు. ఇదే సమయంలో రాత్రి 8.15 గంటలకు ఆలయం వద్ద వరదస్తోందంటూ హాహాకారాలు మిన్నంటాయని తెలిపారు. నిమిషాల వ్యవధిలోనే ఊహించని స్థాయిలో వరద పెరిందని చెప్పారు. 14 అడుగుల ఎత్తులో ఉన్నందున తాను ప్రాణాలతో బయటపడానని తెలిపారు. తనతో పాటు మరో 200 మంది ప్రాణాలు దక్కించుకున్నారని పేర్కొన్నారు. వరద ధాటికి సుమారు 4 వేల మంది చనిపోయి ఉంటారని చెప్పారు. 500 శవాలను తన కళ్లతో చేశానని ఆవేదనతో చెప్పారు.