జంతర్‌మంతర్‌ వద్ద థర్డ్‌ ఫ్రంట్‌ ధర్నా

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి):
డీజిల్‌ ధరల పెంపు, గ్యాస్‌పై సబ్సిడీల ఎత్తివేత, రిటైల్‌ రంగంలో ఎఫ్‌డిఐల అనుమతిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా బంద్‌ జరిగింది. ఎన్‌డిఎ పక్షాలు బలంగా ఉన్న ఉత్తరాదిన బంద్‌ సంపూర్ణంగా జరగగా, దక్షిణాదినా పాక్షికంగా జరిగింది. ఉత్తరాదిన రైళ్ల రాకపోకలకు పలు చోట్ల అంతరాయం కలిగింది. యుపిఎ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తూ ప్రజలు రోడ్డుపైకి వచ్చి తమ నిరసన తెలియజేశారు. దక్షిణాదిన మిశ్రమ స్పందన కనిపించింది. యథావిధిగా రవాణా రాకపోకలు జరిగాయి. బిజెపి రాష్ట్రమైన కర్ణాటకలో బంద్‌ సంపూర్ణంగా జరిగింది. మాజీ ముఖ్యమంత్రి
ములాయం, చంద్రబాబు, సీతారాం ఏచూరి అరెస్ట్‌ ఉన్న మహారాష్ట్రలో బంద్‌ ప్రభావం అంతగా కనిపించలేదు. రైళ్ల రాకపోకలు, బస్సులు యథావిధిగా తిరిగాయి. ఈ బంద్‌కు మమత, మాయావతి, బిజూజనతాదళ్‌ దూరంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ బంద్‌ వల్ల స్టాక్‌ మార్కెట్‌ వెనకడుగు వేసింది. సెన్సెక్స్‌ 125 పాయింట్ల వద్ద ఆగిపోయింది. రిటైల్‌ రంగంలో ఎఫ్‌డిఐల అనుమతిని నిరాకరిస్తూ చిల్లర వర్తకులు ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వరకు ఇచ్చిన ర్యాలీకి విశేష స్పందన లభించింది. రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు చిల్లర వర్తకుల ఆందోళనలో పాలుపంచుకున్నాయి. జంతర్‌మంతర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. జంతర్‌మంతర్‌ వద్ద ప్రజలను ఉద్దేశించి బిజెపి అధ్యక్షుడు నితిన్‌ గట్కారి, సిపిఎం పోలిట్‌ బ్యూరో సభ్యులు సీతారామ్‌ ఏచూరి, జెడియు నేత శరద్‌ యాదవ్‌ ప్రసంగిస్తూ యుపిఎ అవలంబిస్తున్న ప్రభుత్వ విధానాలపై నిప్పులు చెరిగారు. అమెరికాకు తొత్తుగా వ్యవహరిస్తూ మన్మోహన్‌ సింగ్‌ దేశీయ పరిశ్రమలను నాశనం చేస్తున్నారని, ఒక విధంగా అమెరికా ముందు మన్మోహన్‌ గ్రామ దేవతగా వ్యవహరిస్తున్నారని ఏచూరి విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానలకు తాము మద్దతు ఇచ్చే ప్రశ్నే లేదని ప్రజల పక్షానే నిలబడతామని నితిన్‌గట్కారీ, శరద్‌ యాదవ్‌ పేర్కొన్నారు. కాగా జంతర్‌ మంతర్‌ వద్ద వామపక్షాల ధర్నాలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. వేలాది మంది కాంగ్రెసేతర పార్టీల కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొనటం వలన జంతర్‌మంతర్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని టిడిపి అధినేత చంద్రబాబు, ఎస్పీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌, సీతారాం ఏచూరిలను పోలీసులు అరెస్టు చేసి జంతర్‌ మంతర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.