జగదీష్ టైట్లర్‌ను ప్రశ్నించిన సీబీఐ
న్యూఢిల్లీ: ఆయుధాల వ్యాపారి అభిషేక్ వర్మతో సంబంధాల విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జగదీష్ టైట్లర్‌ను సీబీఐ ప్రశ్నించింది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఆమయుధాల తయారీ సంస్థను కేంద్ర ప్రభుత్వ బ్లాక్‌లిస్టు నుంచి తొలగించేలా అధికారులను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించినట్లు అభిషేక్ వర్మ, ఆయన భార్య అన్సియాలపై కేసు నమోదైంది. వర్మకు జగదీష్ టైట్లర్ సహకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. అభిషేక్ వర్మతో కలిసి తాను ఎలాంటి లాబీయింగ్ చేయాలని టైట్లర్ తమ విచారణలో వెల్లడించినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. కేవలం ఒక స్నేహితుడిగానే ఆయనను కలిశానని చెప్పినట్లు పేర్కొన్నాయి. వర్మ వ్యాపార సహచరుడు సి.ఎడ్మండ్ అలెన్‌ను కూడా ప్రశ్నించేందుకు సీబీఐ బృందం అమెరికాకు వెళ్లే అవకాశం ఉంది.