జగన్‌పై దాడి కేసులో స్వతంత్ర దర్యాప్తు

రాష్ట్రపతి కోవింద్‌తో భేటీ అయిన వైకాపా నేతలు

న్యూఢిల్లీ,నవంబర్‌13(జ‌నంసాక్షి): జగన్‌పై జరిగిన దాడి ఘటనపై కేంద్ర ఏజెన్సీతో దర్యాప్తు చేయించాలని వైసీపీ నేతలు రాష్ట్రపతిని కోరారు. ఇప్పటికే కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను వైసీపీ నేతల బృందం కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతల బృందం మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసింది. గత నెల 25న విశాఖ ఎయిర్‌ పోర్టులో వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై శ్రీనివాస్‌ అనే యువకుడు కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన విషయం విదితమే. సుమారు అరగంటపాటు జరిగిన ఈ భేటీలో జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై నిశితంగా రాష్ట్రపతికి వివరించారు. జగన్‌మోహన్‌ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నం, తదనంతరం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును రాష్ట్రపతికి వివరించారు. ఈ ఘటనపై నిష్పపాక్షిక విచారణ జరగాలంటే.. థర్డ్‌ పార్టీతో కేసు దర్యాప్తు చేయించాలని రాష్ట్రపతికి విన్నవించామని వైఎస్సార్‌సీపీ నేతలు విూడియాకు వెల్లడించారు. తమ అభ్యర్థనపై రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని చెప్పారు.

రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసిన బృందంలో వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వరప్రసాద్‌, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, పార్టీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయంత్నంలో ఘటనలో బాబు ప్రమేయం లేకపోతే.. ఈ కేసును స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించొచ్చు కదా అని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజసాయిరెడ్డి ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నానికి సూత్రధారి చంద్రబాబేనని ఆరోపించారు. ఆయనతో పాటు డీజీపీ ఆర్పీ ఠాకూర్‌, టీడీపీ

నేతలు ఆదినారాయణరెడ్డి, యరపతినేని శ్రీనివాసరావు, సినీ నటుడు శివాజీలకు ఈ ఘటనలలో ప్రమేయముందని విూడియాకు వెల్లడించారు. రాష్ట్రపతి లేదా కోర్టు ఉత్తర్వుల ద్వారా నిష్పాక్షిక దర్యాప్తు జరిగితే హత్యాయత్నం వెనకున్న కుట్రదారులు బయటపడతారని అన్నారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసును కేంద్ర సంస్థతో నిష్పాక్షిక దర్యాప్తు చేయించాలని రాష్ట్రపతిని కోరినట్లు చెప్పారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే ఎయిర్‌పోర్టులోకి కత్తి ఎలా వెళ్లిందని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నడూ లేంది.. ఆ రోజే సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్టు రెస్టారెంట్‌లో పనిచేసేందుకు నెలరోజులే పర్మిషన్‌ ఉన్న నిందితుడు శ్రీనివాస్‌.. మూడు నెలల పాటు అక్కడే ఎందుకున్నాడని ప్రశ్నించారు. అయినా, క్రిమినల్‌ కేసులున్న శ్రీనివాస్‌కు.. ఎయిర్‌పోర్టులో పనిచేసేందుకు నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌ ఎలా ఇచ్చారని మండిపడ్డారు.