జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి.

పల్లె పల్లెలో బహుజన సైన్యం నిర్మిస్తాం.
-రాబోయే ఎన్నికల్లో డబ్బు,మద్యం పంపిణీని బిఎస్పీ సైన్యం అడ్డుకుంటుంది.
-బిఎస్పీ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి కుమార్.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,నవంబర్28(జనంసాక్షి):
జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని బిఎస్పీ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి కుమార్ డిమాండ్ చేశారు.సోమవారం జిల్లా కేంద్రంలోని మహేంద్ర నాథ్ చౌరస్తాలో గల బిఎస్పీ పార్టీ కార్యాలయంలో తాలూకా నాయకులు పృథ్వీ రాజ్ ఆద్వర్యంలో
నిర్వహించిన విలేకరుల సమావేశంలో కొత్తపల్లి కుమార్ మాట్లాడుతూ ఉన్నత కులాలు ఆర్థికంగా వెనకబడిన వర్గాలు అంటూ ఏ ఇతర కులాలతో చర్చలు జరపకుండా ఏక పక్షంగా ఈడబ్ల్యూఎస్  పేరుతో 7శాతం జనాభాకు 10శాతం రిజర్వేషన్ ఇవ్వడాన్ని బిఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు.ఎన్నో ఉద్యమాలు చెప్పట్టినప్పటికి,బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని ఎన్నో కమీషన్లు వివరించినప్పటికీ బీసీల ఉద్యమాలను బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు పెడ చెవిన పెట్టిన సంగతి ని బీసీ సమాజం గుర్తించాలని ఆయన కోరారు.50శాతం రిజర్వేషన్ లు దాటొచ్చు అనీ సుప్రీం కోర్ట్ సమర్థిస్తూ ఇచ్చిన తీర్పు ప్రకారం, తెలంగాణ రాష్ట్రం లో బీసీలకు 50శాతం రిజర్వేషన్ లు ఇచ్చే దమ్ము కెసిఆర్ కు ఉందా అనీ ప్రశ్నించ్చారు.ఈ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రంలో బిజెపిని వ్యతిరేకిస్తూ టిఆర్ఎస్,కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ,జనసేన పార్టీలు అభిప్రాయా లను తెలపాలని అన్నారు.70ఏండ్లుగా జాతీయ, ప్రాంతీయ పార్టీలు బీసీ లను మోసం చేస్తున్న తీరును గ్రామ గ్రామాన ఎండగడతా మని తెలిపారు.దేశంలో రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలకు వివిధ పార్టీలలో ఉన్న బిసి సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతి నిధులు గమనించాలని సూచించారు.భహుజన రాజ్యం సాధించేందుకు పల్లె పల్లెలో బహుజన సైన్యం నిర్మిస్తామని తెలిపారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాలను బీఎస్పీ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. భహుజన రాజ్యం తోనే అట్టడుగు కులాలు ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు.బీసీ రిజర్వేషన్ సాధన కొరకు బిఎస్పీ పార్టీ దశలవారీగా కార్యక్రమాలు చేపడుతామని అన్నారు.బీసీ సంఘాలను, బీసీ మేధావులను కలుపుకొని నియోజక వర్గాలు వారిగా సదస్సులు నిర్వహిస్తామని వివరించారు.రాబోయే ఎన్నికలలో డబ్బు, మద్యం పంపిణీ చేసి గెలుపొందాలనుకునే పార్టీలను బహుజన సమాజ్ పార్టీ సైన్యం అడ్డుకుంటుందని హెచ్చరించారు. జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్ సాధన కోసం జిల్లా అంతట త్వరలోనే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శులు కొమ్ము శ్రీనివాస్ యాదవ్, మోత్కురి నాగార్జున,బోనాసి రామచంద్రం మరియు జిల్లా ఇంచార్జ్ లు అంతటి నాగన్న, బిసమోళ్ల యోసేఫ్ లు మాట్లాడారు.ఈ సమావేశంలో బిఎస్పీ నాయకులు ఆనంద్, రామస్వామి, మునిస్వామి,ఎట్టి ఆంజనేయులు,
పృథ్వీ రాజ్, సురేందర్, శివ శంకర్, రాంచందర్, కళ్యాణ్, వెంకటేష్, రాజ్, నాగేష్, మల్లేష్, రమేష్, నాగార్జున,ఇమామ్, బీఎంఎస్ జిల్లా అధ్యక్షులు రాముడు, బీకేఎస్ జిల్లా అధ్యక్షులు వెంకట్ రాములు పాల్గొన్నారు.