జపాన్‌లో భూకంపం.. రెక్టార్‌స్కేల్‌పై 7.3గా నమోదు

టోక్యో, డిసెంబర్‌ 7 : జపాన్‌ తూర్పు తీరంలో శుక్రవారంనాడు భారీ భూకంపం సంభవించింది. రెక్టార్‌ స్కేలుపై 7.3గా నమోదైంది. టోక్యో నగరానికి సునామి హెచ్చరికలను జారీ చేశారు. టోక్యో నగరంలోని భవనాలు ఊగిపోయాయి. ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. జపాన్‌లోని పలు ప్రాంతాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.50 గంటల సమయంలో భూకంపం సంభవించింది. పుకుషిమా అణు విద్యుత్‌ కేంద్రం సురక్షితంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. మియాగీ ప్రాంతంలోని ప్రజలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాగా ఆస్తి, ప్రాణ నష్టంపై వివరాలు అందాల్సి ఉంది. ఇదిలా ఉండగా గతేడాది మార్చి 11వ తేదీన జపాన్‌లో భారీ భూకంపం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.