జర్నలిస్టులకు రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలి.

టి యు డబ్ల్యు జె. (.ఐజేయు) జిల్లా అధ్యక్షులు దండి సంతోష్

గాంధీ చౌక్ వద్ద జర్నలిస్టుల నిరసన. వినతి పత్రం.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. సెప్టెంబర్ 2. (జనంసాక్షి) జర్నలిస్టులకు రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ టి యు డబ్ల్యు జే. (ఐజేయు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.. సోమవారం జర్నలిస్టులకు రక్షణ చట్టం కల్పించాలని కోరుతూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చిన అనంతరం టి యు డబ్ల్యూ జె ( ఐ జే యు) జిల్లా అధ్యక్షులు దండి సంతోష్ మాట్లాడుతూ జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా నిరసన తెలుపుతున్నామని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా జర్నలిస్టుల కు రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయడంతో పాటు మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని ,రైల్వే పాసులతోపాటు అపరిస్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీనియర్ పాత్రికేయులు కోక్కల భాస్కర్ టి యు డబ్ల్యు జె ( ఐజేయు) జిల్లా కార్యదర్శి కాంభోజ ముత్యం మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో ప్రయాకర్ రావు, కాయితి బాలు , బైరి మధు, గంగు సతీష్,. సామల రాజేందర్, చేపూరి శ్రీనివాస్, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.