జవహర్ నగర్ లో బీసీల ఆత్మ గౌరవం – రాజ్యాధికారం సదస్సు
బీసీ సదస్సులో పలువురు వక్తల ఉద్ఘాటన
మేడ్చల్ జిల్లా /
జవహర్ నగర్, సెప్టెంబర్ 16 (జనం సాక్షి):
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ శ్రీ మహంకాళి గుడి ఆవరణం లో బీసీ ల ఆత్మ గౌరవం – రాజ్యాధికారం అనే అంశం పై జవహర్ నగర్ బీసీ సంక్షేమ సంఘం,బీసీ సంఘాల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. రాజ్యాధికారం లేకపోవడం వల్లనే బీసీలు రాజకీయంగా, సామాజికంగా,విధ్యాపరంగా అన్ని రంగాలలో వెనుక బడి ఉన్నారని. బీసీ లు రాజ్యాధికారం సాధించుకోవడానికి రాజకీయాల్లో 52% రిజర్వేషన్ లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.రాజకీయాలకు అతీతంగా బీసీ కులాలు ఐక్యమై సంఘటితం కావాలని,బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ రాజ్యాధికారం సాధించాలని. రానున్న ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం లో బీసీ అభ్యర్థిని నిలబెట్టి ఓటు వేసి గెలిపించు కోవాలని, ప్రధాన రాజకీయ పార్టీలు బీసీ అభ్యర్థులకు టికెట్ ఇవ్వకపోతే ఎన్నికల్లో స్వతంత్రంగా బీసీ అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
జవహర్ నగర్ బీసీ సంఘం భవిష్యత్ కార్యాచరణ తీర్మాన ప్రకటన వివరాలు…
*1)జవహర్ నగర్ లో అన్ని బీసీ కులాలను కలుపుకొని సంఘటితం చేయాలి.*
*2) జవహర్ నగర్ లో బీసీ భవనం నిర్మాణం కోసం కార్యాచరణ కృషి.*
*3) బహుజన మహనీయుల విగ్రహాలను నెలకొల్పాలి.*
*4) రానున్న ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని నిలబెట్టి బీసీ లు అందరూ ఓట్ వేసి గెలిపించాలి.*
*5) జవహర్ నగర్ లోని అన్ని బస్తీలల్లో బీసీ బూత్ కమిటీ లు వేసి, బీసీ ఓటర్లను గుర్తించాలి.*
*6) బీసీ ల ఓట్లు బీసీ లకే అని జవహర్ నగర్ లో గల ప్రతి బీసీ ల ఇంటి గోడలకు గోడ పత్రికలను అతికించి ప్రతిఘ్న చేయించాలి.*
*7) జవహర్ నగర్ బీసీ మేధావులతో రాజ్యాధికార సాధన సభ నిర్వహించాలి.*
ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ బీసీ కులాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గోన్నారు.