జాతీయ రహదారిపై రాస్తారోకో చేసిన బూడిదంపాడు దళితులు

జాతీయ రహదారిపై రాస్తారోకో చేసిన బూడిదంపాడు దళితులు

రఘునాథ పాలెం అక్టోబర్ 05) జనం సాక్షి) మండలలో బూడిదంపాడు గ్రామ దళిత పెద్దలు మాట్లాడుతూ
ఎందరో త్యాగాల ఫలితం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు అభివృద్ధి కోసం దళితులు ఇంకా వెనుకబడి ఉన్నారు అని గ్రహించిన మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దళిత బంధు పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందన్నారు ఈ దళిత బంధు పథకాన్ని ప్రతి ఒక్క దళిత కుటుంబాలకు ఇవ్వాలనే ఆలోచనతో రెండవ విడత దళిత బంధు పంపిణీ లో భాగంగా పార్టీలకు అతీతంగా వారి స్థితిగతులను చూసి ఇవ్వవలసి ఉన్నాయి కాని గ్రామంలో దళితుల కుటుంబాల సంఖ్య 250 పైగా ఉన్నాయి కొందరి స్వార్థం లాభాపేక్షతో కేవలం వాళ్ళకి సంబంధించిన పేర్లు మాత్రమే రాసి మంత్రి కి పంపించి మా గ్రామంలో దళిత బంధు పథకానికి అర్హులు అయిన వారు వీరే అని 39 మంది పేర్లను ఇవ్వడం జరిగిందన్నారు కానీ
అ గ్రామంలో ఒక వార్డ్ మెంబెర్ కుటుంబమునకు చెందిన తండ్రి కొడుకుకు బావకు,బావ కొడుకుకు ఆడబిడ్డకు వారి దగ్గరి బందువులకు ఉద్యోగం ఆర్ధికంగా ఉన్నవారికి అలాగే గ్రామంలో పెళ్లికాని వారికీ వలస వచ్చినవారికి ఉద్యోగరీత్యా వేరే రాష్ట్రాలకు వెళ్లినవారికి కేటాయించి గ్రామంలో ఏళ్ళ తరబడి తాత తండ్రుల కాలం నుండి నివసిస్తు ఆర్థిక పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న వారికి కాకుండా తమ వర్గం వారికే కేవలం మాల సామాజిక వర్గం వారికి కేటాయించి గ్రామంలో అర్హులై కులాంతర వివాహం చేసుకున్న మాదిగ సామాజిక వర్గంవారిని గుర్తించి కేటాయించక పోవడం అసలైన అర్హులను గుర్తించకుండా కేవలం వాళ్ళ పార్టీవారికే కేటాయించడం పట్ల గ్రామ దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తు ఇల్లందు వెళ్ళు ప్రధాన రహదారిపై గ్రామ దళితులు పెద్ద సంఖ్యలో హాజరై సుమారు గంటకు పైగా ప్రధాన రహదారిపై బైటయించి రాస్తారోకో నిర్వహిస్తు నినాదాలు చేస్తుండగా అక్కడికి చేరుకున్న ఎస్సై వాళ్ళ కి నచ్చజెప్పి రాస్తారోకో విరమింపజేసి ట్రాఫిక్ ను క్లియర్ చేసి అనంతరం దళితులు గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లి ముట్టడి చేసి సెక్రటరీని మరియు వార్డు మెంబర్లను దళితుల అందరికి ఆమోదయోగ్యం లేకుండా ఇష్టం వచ్చినట్లు అనర్హులను రాసి పంపించిన లిస్టును రద్దుచేసి మరల అర్హులకు ఎక్కువమందికి లాభం చేకూరెలా చేయాలనీ డిమాండ్ చేసినారు ఈ కార్యక్రమంలో గ్రామ దళితులు అంతొటి ఆనందం గుడిబండ్ల శ్రీకాంత్ కోపల రవి గుడిబండ్ల విజయరాజు వేల్పుల రమేష్ తాళ్లపల్లి అనిల్ పిల్లి పవన్ విజయ మాణిక్యం స్వరూప మరియు గ్రామ దళిత మహిళాలు పురుషులు తదితరులు పాల్గొన్నారు