జాతీయ విపత్తుగా ప్రకటిస్తే ఏం లాభం:షిండే

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ పరిస్థితిని జాతీయ విపత్తుగా ప్రకటించడం వల్ల ప్రయోజనం ఏమిటో చెప్పాలని కేంద్రహోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే అన్నారు. ఉత్తరాఖండ్‌ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు షిండే తెలిపారు. ఇది మానవ తప్పిదం వల్ల వచ్చిన విపత్తు కాదని, ప్రకృతి వైపరిత్యమని ఆయన పేర్కొన్నారు. రోడ్లు పాడైన చోట్ల తాత్కాలిక పుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు ఏర్పాటు చేస్తున్నట్లు షిండే వివరించారు. సహాయక చర్యల్లో లోపాలున్నాయని ఆయన అంగీకరించారు. సహాయక బృందాల మధ్య మరింత సమన్వయం అవసరమని అభిప్రాయపడ్డారు. చాలా మృతదుహాలను గుర్తించలేదని ఆయన పేర్కొన్నారు.