జాబ్ మేళాకు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కొప్పుల..
ధర్మపురి (జనం సాక్షి )ధర్మపురి పట్టణంలో ఎల్.యం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ మరియు భారత జాగృతి సమితి ఆధ్వర్యంలో ధర్మపురి నియోజకవర్గం నిరుద్యోగులకు ధర్మపురి కేంద్రంలో ఆదివారం శ్రీ లక్ష్మీ నృసింహ గార్డెన్ లో నిర్వహించిన మెగా జాబ్ మేళా కు విశిష్ట స్పందన లభించింది.ఈ మెగా జాబ్ మేళా లో 60కు పైగా పెద్ద కంపెనీలతో పాల్గొన్నాయి,
ఈ జాబ్ మేళా కు 2184 హాజరు కాగా, 750 ఇంటర్యూ కు సెలెక్ట్ అయినవారు, వారి లో 680 మంది జాబ్ కు సెలెక్ట్ అయిన వారికి ఎల్.యం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఛైర్ పర్సన్ స్నేహలత ఈశ్వర్ ప్రొసీడింగ్స్ లను అందించారు. ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన ఈ జాబ్ మేళాకు పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత హాజరైంది. ముఖ్యఅతిథిగా ఈ జాబ్ మేళాకు మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరై ఈ సందర్బంగా మాట్లాడుతూ,
మీ పై ఎన్నో ఆశలు పెట్టుకొని చదివించిన తల్లిదండ్రులకు, ఎంతో కష్టపడి మీరు చదివిన చదువుకు తగిన జాబ్ లభించినప్పుడు విద్యార్థులకు, తల్లిదండ్రులకు మరింత గౌరవం, తృప్తి కలుగుతుందని పేర్కొన్నారు.
గ్రామీణ స్థాయిలో ఐటీ ఉద్యోగాలు అందించడమే లక్ష్యంతో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు.చదువు పూర్తయిన అనంతరం ఉద్యోగాల కోసం కంపెనీల చుట్టూ తిరిగే అవసరం లేకుండా జాబ్ మేళాలు నిర్వహించి పలు సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించేలా ఎల్.యం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ మరియు భారత జాగృతి సమితి ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని మంత్రి అన్నారు
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వస్తుందన్నారు.
వివిధ ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికే 1.35 లక్షల ఉద్యోగాల భర్తీ జరగ్గా, మరో 90వేల ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్లను విడుదల చేస్తుందని వివరించారు.ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, అభివృద్ధి పనుల ఫలితంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద పెద్ద సంస్థలు ముందుకొస్తున్నాయని తెలిపారు.
రాష్ట్రంలో అనువైన పరిస్థితులు ఉండటం, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చొరవతో పెద్ద ఎత్తున వివిధ రకాల పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని, లక్షలాది మందికి వాటిల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. అనంతరం జాబ్ మేళాకు వచ్చిన వివిధ సంస్థల ప్రతినిధులకు మంత్రి శాలువా కప్పి సర్టిపికెట్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో జాగృతి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జాడి శ్రీనివాస్ జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షుడు సిరంగి సంతోష్ కుమార్, మహిళా విభాగం జగిత్యాల జిల్లా అధ్యక్షురాలు జమున జాగృతి నాయకులు,నూతి మల్లయ్య ,రాపర్తి విజయలక్ష్మి, నక్క సురేష్,గాలిపెల్లి జగదీష్, కాసెట్టి విజయ్, సంకోజు సురేష్ ,ఎండి అనిఫ్ తదితరులు పాల్గొన్నారు.