జిఎం ల చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్న గని మేనేజర్  రాజేశ్వర రావు

 

పినపాక నియోజకవర్గం ఆగష్టు 23 (జనం సాక్షి): మణుగూరు ఏరియా సింగరేణి కాలరీస్ ఇల్లందు క్లబ్ నందు సోమవారం జరిగిన ఏరియా టార్గెట్ రివ్యూ సమావేశంలో 2021-22 సంవత్సరానికి గాను ఏరియా లెవెల్ లో అత్యధికంగా 119.50 లక్షల టన్నుల బొగ్గు అధికోత్పత్తి సాధించడంతో పాటు అత్యధికంగా 124.03 లక్షల టన్నులు బొగ్గు రవాణా చేసినందుకు ఎంఎన్ఐఓసి గనికి కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఏరియా నూతన జనరల్ మేనేజర్ బీ వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు.అనంతరం కొత్తగూడెం ఏరియాకు బదిలీ పై వెలుతున్న జనరల్ మేనేజర్ జక్కం రమేశ్ చేతుల మీదుగా అభినందన పురస్కారాలు అందచేశారు.
పురస్కారం అందుకున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఎంఎస్ఐఓసి ప్రాంగణంలో ఇద్దరు జిఎం ల చేతుల మీదుగా పురస్కారాన్ని (మెటల్ కప్) గని మేనేజర్ రాజేశ్వర రావు అందుకున్నారు. కప్ ను గనిలో పని చేసి ఉద్యోగులకు, అధికారులకు సభాముఖంగా చూపెట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి ప్రశంసిస్తూ 2021-22 సంవత్సరానికి మణుగూరు ఏరియా నిర్దేశిత 65 శాతం టార్గెట్ ను సాధించి అత్యధిక బొగ్గు ఉత్పత్తిలో, రవాణాలో ఎంఎన్ఐఓసీ కీలక పాత్ర పోషించారు. ఇద్దరు జనరల్ మేనేజర్ చేతుల మీదుగా అభినందన పురస్కారం అందుకోవడం మనందరికీ ఎంతో గర్వ కారణం మనమందరం ఇదే స్పూర్తితో 2022-23 సంవత్సరమునకు నిర్దేశించబడిన ఏరియా లక్ష్యంలో మన వంతు టార్గెట్ ను మించి రక్షణతో కూడుకున్న ఉత్పత్తిని చేయడం, నాణ్యతతో రవాణ చేయడంలో ఎంఎన్జిఓసి మరెన్నో పురస్కారాలు అందుకునేలా మనమందరం ఇలాగే సమిష్టిగా, దృఢ సంకల్పంతో కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎం ఎన్ జి ఓ సి పి ఓ శ్రీనివాస చారి, గని ఉద్యోగులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.