జిఎస్టీ నిధులతో ఎపికి ఊరట

ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడే అవకాశం
అమరావతి,అక్టోబర్‌29( జనం సాక్షి ) ఆర్దిక ఇబ్బందులతో సతమతం అవుతున్న ఏపీ ప్రభుత్వానికి కొంత మేర ఊరట కలగనుంది. ఇప్పటికే భారీగా అప్పులు చేస్తూ కేంద్ర సాయం కోరుతున్న ఏపీ ప్రభుత్వానికి కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయంతో నిధులు సమకూరనున్నాయి. కేంద్రం తాజాగా రాష్టాల్రకు రూ.44 వేల కోట్ల జీఎస్టీ పరిహారం విడుదల చేసింది. అందులో భాగంగా.. తెలంగాణకు రూ.1,264 కోట్లు , ఆంధ్రప్రదేశ్‌కు రూ.905.59 కోట్లు విడుదల అయ్యాయి. కొవిడ్‌ కారణంగా ఏర్పడిన పన్ను నష్టం భర్తీ కోసం బహిరంగ మార్కెట్‌ నుంచి సేకరించిన రుణాలను యథాతథంగా రాష్టాల్రకు పరిహారం రూపంలో చెల్లించినట్లు కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.905.59 కోట్లు, తెలంగాణకు రూ.1,264.78 కోట్లు ఇచ్చినట్లు తెలిపింది. దీంతో 2021`22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తం రూ.1.59 లక్షల కోట్ల బకాయిలను పూర్తిగా చెల్లించిన్లటైందని పేర్కొంది. ఇందులో ఏపీకి రూ.3,272.19
కోట్లు, తెలంగాణకు రూ.4,569.49 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడిరచింది. ఆదాయనష్ట భర్తీ కోసం జులై 15న రూ.75వేల కోట్లు, అక్టోబరు 7న రూ.40వేల కోట్లు, ఇప్పుడు రూ.44వేల కోట్లు విడుదల చేసినట్లు గుర్తుచేసింది. సెస్‌ వసూలు ద్వారా వచ్చే మొత్తం నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్టాల్రకు మరో రూ.లక్ష కోట్లు పరిహారం కింద అందించనున్నట్లు తెలిపింది. ఆ మొత్తంలో తెలుగు రాష్టాల్రకు తమ వాటా దక్కనుంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలతో ఆర్దికంగా భారం పడిరది. అదే సమయంలో రెవిన్యూ వసూళ్లు భారీగా పడిపోవటం..కరోనా కారణంగా ఆదాయ లక్ష్యలు అనేక శాఖలు చేరుకోకపోవటంతో ఆర్దికంగా ఇబ్బందులు తప్పటం లేదు. దీని పైన రాజకీయంగానూ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ సమయంలో అనేక కార్పోరేషన్ల ద్వారా రుణాలను ఏపీ ప్రభుత్వం తెచ్చుకుంటోంది. అయితే, తాజాగా కొంత మేర రెవిన్యూ వసూళ్లు పెరగటం కూడా ఏపీ ప్రభుత్వానికి ఉప శమనంగా మారింది. ఇక, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు..అదే విధంగా 15వ ఆర్దిక సంఘం సిఫార్సుల మేరకు రెవిన్యూ లోటు భర్తీ నిధుల పైన ఏపీ ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. ఇదే సమయంలో ఉద్యోగుల నుంచి ప్రభుత్వం పైన పీఆర్సీ తో పాటుగా డీఏల కోసం ఒత్తిడి పెరుగుతోంది. ఈ రోజు జరగనున్న కీలక సమావేశంలో దీని పైన నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.