జిల్లాలో వనరులు పుష్కలం

తిరుపతి,ఫిబ్రవరి2(జ‌నంసాక్షి): జిల్లాలో వివిధ రంగాలకు అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. తిరుపతి ప్రాంతంలో పర్యాటకం, వినోదం, ఐటీ సంబంధిత పరిశ్రమలు స్థాపించడానికి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఆసక్తి కనబరుస్తున్నారని వివరించారు. ఈ పరిశ్రమల స్థాపనతో యువతకు వివిధ రంగాల్లో ఉపాధి లభించడంతో పాటు గ్రామస్థాయిలో వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో యువతకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఏడాదిలో యువతకు ఒక లక్ష ఉద్యోగాలు కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ప్రణాళికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. వివిధ నైపుణ్య కేంద్రాల్లో వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇప్పించి వారికి ఉపాధి రంగంలో యువతకు ఉద్యోగ భద్రత కల్పించడానికి చర్యలు చేపట్టాలన్నారు. డీఆర్‌డీఏ, మెప్మా, సెట్విన్‌, హార్టీకల్చర్‌, వివిధ శాఖల సమన్వయంతో యువతను ఉపాధి రంగాలవైపు మళ్లించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.