జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వస్తుందని ఊహించలేదు.
ఈ అవార్డు మా తల్లిదండ్రులకు అంకితం.
కరోనా సమయంలో 250 గణిత పాఠ్యాంశాలను యూట్యూబ్లో బోధించడం జరిగింది.
జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలు బుసిరెడ్డి దేదీప్యశ్రీ.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 5(జనంసాక్షి):
జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వస్తుందని ఊహించలేదని జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికై సన్మానం పొందిన జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలు నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల
గణితోపాధ్యాయురాలు అన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వస్తుందని ఊహించలేదని ఆదివారం సాయంత్రం మా తోటి ఉపాధ్యాయులు చెబితే తెలిసిందని అన్నారు.జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికై సన్మానం పొందడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.మా అమ్మ నాన్న ఉపాధ్యాయులు కావడం వల్ల మా ఇంట్లో విద్యార్థుల విద్యాభివృద్ధి గురించే ఎక్కువ చర్చ జరుగుతుంటుంటుందని అన్నారు. ఎలా చెబితే విద్యార్థి అభివృద్ధి చెందుతాడో ప్రణాళిక వేసుకుంటామని అన్నారు.విధి నిర్వహణలో అలసత్వం వహించడం జరగదని తెలిపారు. విద్యార్థుల బాధ్యత పదవి తరగతి వరకే కాక తదనంతర విద్యాభ్యాసం పట్ల కూడా శ్రద్ధ వహించి వారికి సహకరించడం సహాయం చేయడం మా ఇంట్లో అలవాటని అన్నారు. కరోనా సమయంలో కూడా విద్యార్థుల కొరకు గణితానికి సంబంధించి 250 కి పైగా పాఠ్యాంశాలు యూట్యూబ్ ద్వారా బోధించడం జరిగిందని అన్నారు.ప్రతిరోజు కనీసం నలుగురైదుగురి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతానని అన్నారు. నా విధి నిర్వహణలో సహకరిస్తున్న తోటి ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు అధికారులకు ధన్యవాదాలని తెలిపారు.ఈ అవార్డు మా తల్లిదండ్రులకు అంకితం అని అన్నారు. నేను చదువు చెప్పిన విద్యార్థులందరూ జీవితంలో స్థిరపడి ఉత్తమ పౌరులుగా వెలుగొందాలని నా అభిలాష అని అన్నారు.