జీవీఎల్‌ తెలుగువారికే పుట్టుంటే.. 

క్షమాపణలు చెప్పాలి
– బీజేపీ ఆరోపణలపై ఏ విచారణకైనా సిద్ధం
– జీవీఎల్‌పై మంత్రి అయ్యన్నపాత్రుడు ఆగ్రహం
న్యూఢిల్లీ, ఆగస్టు8(జ‌నం సాక్షి) : బీజేపీ నేత జీవీఎల్‌ నరసింహారావుపై ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జీవీఎల్‌ తెలుగు వారికే పుట్టుంటే తెలుగు వారందరికీ క్షమాపణ చెప్పాలని అయ్యన్నపాత్రుడు అన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ రైల్వే మంత్రితో సమావేశానికి జీవీఎల్‌ను ఎవరు రమ్మన్నారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు సెంటిమెంట్‌గా మారిన రైల్వే జోన్‌ అంటే జీవీఎల్‌కు అలుసుగా మారిందని అన్నారు. జీవీఎల్‌ కి సంస్కారం లేదన్న అయ్యన్న.. ఆయనను తెలుగు రాష్ట్రాల్లో తిరగనివ్వరని చెప్పారు. సురేష్‌ప్రభు విశాఖకు వచ్చిన సమయంలో రైల్వే జోన్‌ ఇస్తామన్నారని అయ్యన్న గుర్తుచేశారు.  ఏపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందన్న బీజేపీ ఆరోపణలపై అయ్యన్న స్పందిస్తూ.. ఏ విచారణ వేసినా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఏపీకి అండగా ఉంటానని చెప్పిన మోదీ ఇప్పుడు నిలువునా ముంచేశారన్నారు. కనీస సహకారం కూడా అందించకుండా ఏపీ ప్రజలను చిన్న చూపు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక ¬దా కంటే ఎక్కువగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటే ఒప్పుకున్నామని, కానీ కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా, ప్రత్యేక ¬దా ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. ప్రత్యేక ¬దాకోసం కేంద్రం పై చంద్రబాబు పోరాడుతుంటే మోడీని నిలదీయాల్సిన పవన్‌, జగన్‌లు చంద్రబాబును నిందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక ¬దా వచ్చే వరకు తెదేపా ఆందోళన కొనసాగిస్తుందని అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు.
———————-