జులై చివరి నాటికి మెట్రో ఫేజ్2 ప్రారంభం

నాంపల్లి రైల్వేస్టేషన్, ఎంజీబీఎస్‌ను మెట్రోతో అనుసంధానం చేస్తాం
మెట్రోతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి
త్వరలో నగరంలో ఎలక్ట్రిక్ బస్సులు
500ల ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయబోతున్నాం
మియాపూర్ స్టేషన్‌లో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
మెట్రో ఫేజ్2 పనులను పరిశీలించిన మంత్రులు
హైదరాబాద్, జూన్20(జనం సాక్షి) : జులై చివరి నాటికి మెట్రో ఫేజ్‌ా2ను ప్రారంభిస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బుధవారం నగరంలో మెట్రో ఫేజ్‌ా2 పనులను మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు పలువురు అధికారులు పరిశీలించారు. ఇందులో భాగంగా అవిూర్‌పేట స్టేషన్ నుంచి ఎల్బీనగర్ వరకు ట్రయల్ రన్‌లో భాగంగా మెట్రోలో మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి ప్రయాణించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు మెట్రోను వేగవంతంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. తొలి దశ మెట్రోలో ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందన్నారు. జులై చివరి నాటికి మెట్రో రెండో దశ పూర్తవుతుందన్నారు. మెట్రోతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయని చెప్పారు. మెట్రో కారిడార్‌లో 42 ప్రదేశాల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. నాంపల్లి రైల్వేస్టేషన్, ఎంజీబీఎస్‌ను మెట్రోతో అనుసంధానం చేస్తున్నామని పేర్కొన్నారు. నగరంలో మెట్రోను వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతామని చెప్పారు. 500ల ఎలక్టిక్ర్ బస్సులను కొనుగోలు చేయబోతున్నామని తెలిపారు. మియాపూర్ స్టేషన్‌లో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. నగరంలో వాహనాలను పెద్దసంఖ్యలో వాడటం వల్ల ట్రాఫిక్ సమస్యతో పాటు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుందన్నారు. ట్రాఫిక్‌ను తగ్గించేందుకు, కాలుష్యాన్ని నివారించేలా ప్రజా రవాణాను మెరుగుపర్చేల కృషి చేస్తున్నట్లు తెలిపారు. చెన్నై, బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ మెట్రోకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తుందన్నారు. ప్రతి రోజు హైదరాబాద్ మెట్రోలో 80 వేల మంది ప్రయాణిస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు.



