జూబ్లీహిల్స్ లో దారుణం

భార్యను చంపిన భర్త

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ పరిధి వెంకటగిరిలో దారుణం సంఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను భర్తే హత్యచేశాడు. భార్య హసీనాబేగంను భర్త సిరాజ్ గొంతు కోసి చంపాడు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలే హత్యకు ప్రాథమిక కారణంగా పోలీసులు వెల్లడించారు.