జూలపల్లి లో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల భారీ ర్యాలీ – గడప గడపకు కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ కార్డుల పంపిణీ

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలోని జూలపల్లి గ్రామం లో ఏఐసీసీ సెక్రెటరీ, మంథని ఎమ్మెల్యే, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు జూలపల్లి లో గ్రామములో తిరుగుతూ కాంగ్రెస్ విజయభేరి సభలో సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాల కార్డులను గడప గడపకు కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలో పెద్ద ఎత్తున ర్యాలీ చెప్పడంతో పాటు గడప గడపకు తిరుగుతూ ఆరు గ్యారంటీల కార్డులను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కిసాన్ కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా చైర్మన్ ముస్కుల సురేందర్ రెడ్డి , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైనాల రాజు మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకం ద్వారా.. మహిళలకు ప్రతి నెల ఇరవై అయిదు వందల రూపాయలు, అయిదు వందలకే గ్యాస్ సిలిండర్, ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం లభిస్తోందని, ఈ పథకాన్ని మహిళలు మెచ్చు కుంటున్నారని అన్నారు. రైతుభరోసా కింద ప్రతిఏటా రూ. 15000లు, రూ.12000లు కౌలు రైతులకు వ్యవసాయ కూలీలకు, వరి పంటకు రూ 500 బోనస్, గృహాజ్యోతి ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, ఇంటి స్థలం, గృహ నిర్మాణానికి ఐదులక్షల అందించనున్నామన్నారు. యువ వికాసం కింద ప్రతివిద్యార్ధికి ఐదులక్షల విద్యాభరోసా కార్డు, ప్రతిమండలంలో తెలంగాణ ఇంటర్నేషల్ స్కూల్ ఏర్పాటు ద్వారా ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను ఉచితంగా అందించనున్నామన్నారు,చేయూత పింఛన్ ప్రతినెలా నాలుగు వేల రూపాలు, రూ.10 లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ ఇన్సూరెన్స్ ద్వారా ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రతను కల్పించనున్నమని గ్రామ ప్రజలకు గ్యారంటీ కార్డ్స్ కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేసి వాటి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.