జైశివ సరికొత్త నినాదం
జై శ్రీ రామ్‌కు దీదీ కౌంటర్
భాజపా అవుట్ సైడర్ పార్టీ
తృణముల్ ఇంటి పార్టీ
బెంగాల్ బిడ్డే ముఖ్యమంత్రి కావాలి
మమతా కొత్త ఎత్తులు
న్యూఢిల్లీ, మార్చి 6 (జనంసాక్షి): జైశ్రీరామ్ అంటూ భాజపా కార్యకర్తలు ఇబ్బంది పెట్టడాన్ని కౌంటర్ గా ది ది బెంగాల్ లో జై శివ నినాదం ఎత్తుకుంది.బీజేపీ ‘అవుట్ సైడర్స్ పార్టీ’ అంటూ సీఎం మమత పదేపదే బీజేపీని ఇరుకున పెడు తున్నారు. బీజేపీ కూడా అంతే కౌంటర్ ఇస్తోం ది. తమ పార్టీ స్థాపకులు శ్యామాప్రసాద్ ముఖర్జీ ఎక్కడి వారు? బెంగాలీ కాదా? అంటూ బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఎన్నికలు దగ్గరపడు తుండ టంతో బెంగాల్ ఎన్నికల ముఖచిత్రం మారి పోతోంది. సీఎం మమత బెనర్జీ అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించారు. మరోవైపు తా ను నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తానని స్వయం గా మమతా బెనర్జీ ప్రకటించారు. మమత ఎత్తులకు బిజెపి పై ఎత్తులు వేస్తోంది. బెంగాల్లో పాగా వేసేందుకు అవసరమైన అస్త్రశస్త్రాలను సిద్దం చేస్తోంది. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ కు చెందిన రాజకీయ కురువృద్ధుడు, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ మాజీ సభ్యుడు దినేశ్ త్రివేది బీజేపీలో చేరారు. నెల క్రితం వరకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన ఫిబ్రవరి 12న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, రాజ్యసభ సభ్వత్వానికి రాజీనామా చేశారు. తాజాగా శనివారం ఆయన ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. నడ్డా ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కూడా అక్కడే ఉన్నారు. ఇకపోతే మమతా బెనర్జీ సవాల్‌కు బిజెపి నేతలు ప్రతిసవాళ్లు విసరుతున్నారు. అయితే సీఎం మమత నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించగానే ప్రత్యర్థి సుబేందు అధికారి గట్టి కౌంటర్ ఇచ్చారు. నందిగ్రామ్ నుంచి సీఎం మమత బరిలోకి దిగడాన్ని మేం ఆహ్వానిస్తున్నాం. మిడ్నాపూర్ బిడ్డనే ప్రజలు కావాలను కుంటున్నారు. అవతలి వ్యక్తులను ఏమాత్రం కోరుకోవడం లేదు. నందిగ్రామ్ ప్రజల ప్రబలమైన డిమాండ్ ఇదే. మిమ్మల్ని యుద్ధ క్షేత్రంలో చూసుకుంటాం. మే 2న విూరు ఓడిపోతారు. క్షేత్రం నుంచి నిష్కమ్రిస్తారని అంటూ సుబేందు ఘాటైన కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి ఆదివారం ప్రధాని మోదీతో కలిసి ఓ సమావేశంలో వేదిక పంచుకోబోతున్నారు. అయితే ఆయన బీజేపీలో చేరుతున్నారా? లేక… బీజేపీ తరపున ప్రచారం చేస్తారా? అన్న విషయాలపై మాత్రం ఇప్పటి వరకూ సమాచారమేదీ వెల్లడికాలేదు. గత నెల 16న ఆయన ఆరెస్సెస్ సరసంఘ చాలక్ మోహన్ భాగవత్‌తో కూడా భేటీ అయ్యారు. మిథున్ చక్రవర్తి గతంలో తృణమూల్ నుంచి రాజ్యసభలో ప్రాతినిథ్యం వహించారు. ఆ తర్వాత శారదా చిట్‌ఫండ్ కేసులో చిక్కుకోవడంతో రాజ్యసభ పదవి నుంచి తప్పుకున్నారు. ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన కారణంగా ఆయనన్ను ఈడీ ప్రశ్నించింది. ఈ ఘటన తర్వాతే ఆయన అనారోగ్య కారణాలను చూపుతూ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆయన తృణమూల్ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. మరోవైపు బీజేపీ మాత్రం మిథున్ చేరికపై పరోక్షంగా సంకేతాలినిచ్చింది. మమత బెనర్జీ పాలనకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రముఖ వ్యక్తుల్లో మిథున్ కూడా ఒకరు. మమత గ్దదె దిగాలని బెంగాలీలతో పాటు చాలా మంది ఇతర ప్రాంతాల వారూ కోరుకుంటున్నారని బీజేపీ ఉపాధ్యక్షుడు జయప్రకాశ్ మజుందార్ వ్యాఖ్యానించారు. మోదీ వేదికగా మిథున్ తృణమూల్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది ప్రస్తుతం ఆసక్తిదాయకం.