జనంసాక్షి జగన్‌పై దాడిని కప్పిపుచ్చుకునే యత్నం
నెల్లూరు,అక్టోబర్29(జనంసాక్షి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని కప్పిపుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. జగన్‌పై దాడిని వైసీపీకి అంటగడుతూ టీడీపీ దుష్పచ్రారానికి పాల్పడుతుండడం సిగ్గుచేటన్నారు. జగన్మోహన్‌రెడ్డిని పరామర్శించాల్సిన ముఖ్యమంత్రి, టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగడం, పరామర్శించిన ఇతర రాష్ట్రాల నాయకులపై విమర్శలు చేయడం సీఎం నీచరాజకీయాలకు నిదర్శనమన్నారు. గతంలో జగన్మోహన్‌రెడ్డిపై సీబీఐ దాడులు చేస్తే చట్టం తనపని తాను చేసుకుంటుందని చంద్రబాబు అన్నారని, ఇప్పుడు రాష్ట్రంలో ఐటీ అధికారులు దాడులు చేస్తుంటే అందులో టీడీపీ నాయకులు ఉండడంతో తమ పార్టీపై కుట్ర అని మాట్లాడుతుండడం సిగ్గుచేటన్నారు. హత్యాయత్నం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే దేశంలోని అన్ని రాజకీయ పార్టీ నాయకుల చుట్టూ తిరుగుతున్నారనీ, అయినా రాష్ట్ర ప్రజలకు అన్ని విషయాలూ తెలుసననీ అన్నారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై ప్రత్యేక సంస్థల ద్వారా విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.