టమాటా ధరల తగ్గుదల

చిత్తూరు,అక్టోబర్‌20(జ‌నంసాక్షి): టమోటా ధరలు మళ్లీ తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చిత్తూరు, కడప తితర ప్రాంతాల్లో పండించిన పంటలకు ధర దక్కడం లేదు.  నిలకడలేని ధరలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తాజాగా ధరలు తగ్గడంతో పంటను కోసిన కూలీ కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. రాయచోటి, పులివెందుల, ముద్దనూరు. రైల్వేకోడూరు తదితర మండలాల్లో పంట సాగులో ఉంది.. తోట నుంచి మార్కెట్‌కు టమోటాను తరలించడానికి వాహనం బాడుగ రూ.1,500, టమోటాలను కోయడానికి కూలీలకు మరో రూ,1,500 పోను 114 బాక్సులకు చేతికి వెయ్యి కూడా రావడంలేదని రైతులు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 10 వేల ఎకరాల్లో పంటసాగులో ఉంది. తాజాగా మరో 5 వేల ఎకరాల్లో దిగుబడులు మార్కెట్లోకి వచ్చాయి. 114 పెట్టెల సరకును వ్యాపారులు బుధవారం రూ.5 వేలకే కొనుగోలు చేశారు.నాణ్యత ఉన్న పంటను మాత్రం రూ.9 వేలతో కొనుగోలు చేశారు.దిగుబడులు చేతికివచ్చే సమయంలో ధరలు తగ్గితే రైతులు నష్టపోవాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు. మదనపల్లి మార్కెట్‌లో కూడా ధరలు పలకడం లేదు.