టిఆర్ఎస్ ప్రభుత్వం తోనే రాష్టం అభివృ
జహీరాబాద్ ఆగస్టు 30 (జనంసాక్షి) టీఆర్ఎస్ ప్రభుత్వం లోనే తెలంగాణ రాష్ట్రం లోని గ్రామాలు అన్ని అభివృద్ధి చెందుతున్నాయి అని ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. మంగళవారం న్యాలకల్ మండలంలోని గంగ్వార్, కల్బెమాల్, బాసంతపుర్, గ్రామలలో 65 లక్షల రూపాయల ఎస్ డి ఎఫ్ ప్రత్యేక అభివృద్ధి నిధులతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ప్రారంభించారు. అనంతరం అర్హులైన 57 సంవత్సరాలు నిండిన లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ ధృవపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పల్లెను అభివృద్ధి పరచాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకువచ్చారన్నారు. జహీరాబాద్ నియోజకవర్గ ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలోని 138 గ్రామాలకు 20 లక్షల చొప్పున 27.60 కోట్ల రూపాయలను మంజూరు చేశారన్నారు. ఈ నిధులతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే మాణిక్ రావు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో జహీరాబాద్ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమాల్లో జడ్పీటిసి స్వప్న భాస్కర్, ఎంపీపీ అంజమ్మ, మాజీ మండల అద్యక్షులు నర్సింహ రెడ్డీ, సీనియర్ నాయకులు పాండురంగ రెడ్డీ, ఉప సర్పంచుల ఫోరమ్ అద్యక్షులు పీటర్ రాజు, సర్పంచులు జయశ్రీ నిరంజన్ రెడ్డీ, మహిపాల్, షమల సంజీవ్, వివిధ గ్రామాల సర్పంచలు దేవిదాస్, చంద్రన్న, కుతుబుద్దిన్, నాయకులు ఇజ్రాయేల్ బాబీ, రత్నం,మాజీ సర్పంచ్ లు సిద్ధ రెడ్డీ, శ్రీనివాస్, పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డీ, వార్డు మెంబర్లు అంజన్న, అమృత, లక్ష్మణ, జడ్పీ సఈవో ఎల్లయ్య, ఎంపిడివో సుమతి, ఎంపీవో లు, అధికారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.