టిడిపిది రైతు ప్రభుత్వం: మంత్రి ఆది

కడప,అక్టోబర్‌9(జ‌నంసాక్షి): జమ్మలమడుగులో వెంకటేశ్వర పశువైద్య విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో
మంగళవారం గొర్రెల పెంపకందారుల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గన్న రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సి.ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ… ప్రస్తుత ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమన్నారు. శిక్షణా కార్యక్రమంలో గొర్రెల పెంపకందారులకు గొర్రెల పెంపకంపై సరైన మెళకువలు కల్పించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారాన్ని అందిస్తోందన్నారు. గొర్రెలతో పాటు పశువుల పెంపకందారులకు కూడా ప్రత్యేకంగా లోన్లు ఇస్తున్నామని తెలిపారు. చనిపోయిన పశువులకు కూడా ఇన్సూరెన్స్‌ ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. అక్టోబర్‌ ఒకటవ తేదీ నుండి డిసెంబర్‌ ఆరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా పశుగణన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నామన్నారు. గోపాలమిత్రలో పనిచేసే సిబ్బందికి కూడా అంగన్వాడీలకు పెంచిన విధంగానే వేతనాన్ని ఒక వారంలో పెంచుతున్నామని తెలిపారు. గోకులం, మినీ గోకులం వంటివి అమలు చేస్తున్నామని, కడప జిల్లాకు గోకులం 30, మినీ గోకులం 1500 వస్తాయని పేర్కొన్నారు.

తాజావార్తలు