టిడిపి కార్యాలయంపై దాడిచేసిన పోలీస్
విూడియా సమావేశంలో వెల్లడిరచిన అశోక్‌బాబు
గుంటూరు,అక్టోబర్20(జనం సాక్షి):ఏపీలో అధికార వైసీపీ, టీడీపీ పార్టీల మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. మంగళగిరిలో టీడీపీ కార్యాలయంపై వైసీపీ నేతలే దాడి చేశారంటూ టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఆరోపించారు. దాడి చేసి పారిపోతుండగా ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఆయన నీవెవరని అడగగా పోలీస్ నంటూ సమాధానమిచ్చాడు. అయితే ఐడీ కార్డు చూపించమని కోరగా.. పడిపోయిందంటూ నాయక్ బదులిచ్చాడు. దీంతో ఆ వ్యక్తిని ప్రెస్‌విూట్‌లో కూర్చోబెట్టిన అశోక్‌బాబు ఇతడే తమ కార్యాలయంపై దాడి చేశాడంటూ చెప్పారు. వైసీపీ నేతలే పోలీసులతో చేయి కలిపి.. టీడీపీ ఆఫీస్‌లపై దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉంటే మంగళవారం నాటి దాటి ఘటనలో టీడీపీ నేతలపై మంగళగిరి పీఎస్‌లో కేసు నమోదైంది. టీడీపీ కార్యాలయానికి వచ్చిన ఓ పోలీస్‌పై దాడి చేశారంటూ కేసు నమోదు చేశారు. ఇందులో ఏ1గా లోకేష్, ఏ2గా అశోక్‌బాబు, ఏ3గా ఆలపాటి రాజా, ఏ4గా తెనాలి శ్రవణ్‌ను చేర్చారు. ఈ నలుగురిపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వీరితో పాటు మరో 70 మంది టీడీపీ కార్యకర్తలపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు.