టిడిపి తీరుపై మండిపడ్డ మంత్రులు,వైసిపి నేతలు


పట్టాభి మాట్లాడిరది భాషేనా అంటూ మండిపాటు
సిఎం జగన్‌ను తిడుతుంటే చూస్తూ ఊరుకోవాల అని సవాల్‌
టిడిపిని రద్దుచేయాలని కోరుతామన్న బొత్స
అమరావతి,అక్టోబర్‌20  ( జనం సాక్షి ) : విపక్ష టిడిపి తీరుపై మంత్రులు, వైసిపి నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పట్టాభి మాట్లాడిన భాషను ఎవరైనా సహిస్తారా అని అన్‌ఆనరు. చంద్రబాబు ఛాలెంజ్‌ హాస్యాస్పదమని.. తమ సహనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. పట్టాభి వ్యాఖ్యలను నారా భువనేశ్వరి, బ్రాహ్మణి సమర్థిస్తారా అని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన మంచి మనసు సీఎం జగన్‌ది. చంద్రబాబును సొంత పార్టీ నేతలే నమ్మడంలేదు. టీడీపీ బంద్‌ను ప్రజలు పట్టించుకోలేదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. సీఎం జగన్‌పై టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలు అభ్యంతరకరమని మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరంలో అన్నారు. టీడీపీని నిషేధించాలని ఈసీని కోరతామన్నారు. చంద్రబాబుది ఎప్పుడూ క్రిమినల్‌ ఆలోచనలే. టీడీపీ నేతల భాషను పవన్‌ ఎందుకు ఖండిరచలేదని మంత్రి బొత్స ప్రశ్నించారు. టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మట్లాడాలని బొత్స హితవు పలికారు. అందుకే టీడీపీని నిషేధించాలని ఈసీని కోరుతామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నీచమైన రాజకీయాలు చేస్తున్నారన్నారు. టీడీపీ నేతల భాషను పవన్‌, బీజేపీ నేతలు ఎందుకు ఖండిరచడం లేదు? టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి. చంద్రబాబు, పవన్‌ కలిసి ప్లాన్‌ ప్రకారమే రాష్ట్రంలో అశాంతి సృష్టిస్తున్నారు. చంద్రబాబు బేషరుతుగా క్షమాపణ చెప్పాలి. మావోయిస్ట్‌ పార్టీకి టీడీపీకి తేడా లేదు. చంద్రబాబు ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు, టీడీపీ నేతలు మాట్లాడిన భాష సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. చంద్రబాబు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని పేర్కొన్నారు.
టిడిపి తీరుపై మంత్రి అనిల్‌ నేడు సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే చూసుకుందాం రమ్మంటూ ప్రతిపక్ష పార్టీ నేతలకు సవాల్‌ విసిరారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. సీఎంని తిట్టిస్తే గాజులు తొడుక్కున్నామా? సీఎం జగన్‌రెడ్డి కోసం దేనికైనా సిద్దమే. విూరు చిత్తూరులో పుట్టుంటే రా.. చూసుకుందాం. నెల్లూరులో వారం రోజులు ఉంటా రమ్మను. సీఎంని తిట్టిన విషయం పవన్‌కు గుర్తు లేదా? సీఎం ఫ్యాక్షనిస్ట్‌ అయితే విూరు ఉంటారా? వైసీపీ కార్యకర్తలను ఎవడు తాకుతాడో చూస్తాం. ఎవడొస్తాడో రండిరా.. అవసరమైతే కాన్వాయ్‌ని కూడా పక్కనబెట్టొస్తా అని పేర్కొన్నారు. ఇదిలావుంటే రాజకీయ చరిత్రలో నిన్నటి రోజు ఓ దుర్దినమని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు తమ ఉనికి కోల్పోతుందని భయం పట్టుకుందని తెలిపారు. భయంతోనే పెయిడ్‌ ఆర్టిస్ట్‌ పట్టాభి లాంటి వారితో ఇష్టానుసారంగా మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. పట్టాభి మాట్లాడే బాష వింటుంటే రక్తం మరిగిపోతుందన్నారు. వైసీపీ శ్రేణుల దాడులు సరైనవే అని అన్నారు. టీడీపీ బాష అలా ఉంటే వైసీపీ ప్రతి చర్య ఇలానే ఉంటుందని తెలిపారు. చంద్రబాబు, అతని అనుచరులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఎంపీ మోపిదేవి హెచ్చరించారు.