టీడీపీకి వెన్నుదన్ను బీసీలే 

– బీసీ సబ్‌ప్లాన్‌కు తామే చట్టబద్ధత కల్పించాం
– జగన్‌ ఫ్రస్టేషన్‌తో మాట్లాడుతున్నాడు
– జగన్‌కు కన్నా లక్ష్మీనారాయణ అద్దెమైకు
– టెలీకాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం చంద్రబాబు
అమరావతి, ఫిబ్రవరి18(జ‌నంసాక్షి) : తెదేపా పార్టీలకు బీసీలే వెన్నుదన్ను అని, వారి అభివృద్ధి కోసం తెదేపా ఎప్పుడూ కృషి చేస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం తెదేపా ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ లో మాట్లాడారు.. బీసీ సభలో జగన్‌ ఫ్రస్టేష్రన్‌తో మాట్లాడారని చంద్రబాబు అన్నారు. టీడీపీకి వెన్నుదన్ను బీసీలే అని అది వైసీపీకి మింగుడు పడటం లేదని విమర్శించారు. బీసీ సబ్‌ప్లాన్‌కు తామే చట్టబద్ధత కల్పించామని.. అయితే మళ్లీ చట్టబద్ధత కల్పిస్తామని జగన్‌ అనడం అవగాహనా రాహిత్యమే అని వ్యాఖ్యానించారు. ‘మనం జయ¬ బీసీ సభ పెట్టి విజయవంతం చేశామని, అదిచూసి జగన్‌ దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళారని అన్నారు. నిన్న హడావుడిగా సభ పెట్టి ఏది పడితే అది మాట్లాడారన్నారు. జగన్‌కు కన్నా లక్ష్మీనారాయణ అద్దె మైకు అని విమర్శించారు. వీఆర్‌ఎస్‌ ద్వారా అందరి అభిప్రాయాలను స్వీకరిస్తున్నామని, ఎన్నికల కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైందని నేతలతో సీఎం అన్నారు. ఉత్తమ బృందాన్ని ఎంపిక చేస్తున్నామని చెప్పారు. అభ్యర్థులను కూడా త్వరలోనే ప్రకటిస్తామని సీఎం వెల్లడించారు. వైఎస్‌ పాలనలో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. టీడీపీ పాలనలో కౌలు రైతుల్లో పూర్తి భరోసా ఉంటుందని, కౌలు రైతు కుటుంబానికి రూ.15వేల చొప్పున ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. కాపుల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నామన్నారు. కాపు కార్పోరేషన్‌
పెట్టామని…బడ్జెట్‌లో భారీగా నిధులిచ్చామని తెలిపారు. కాపు భవన్‌లు నిర్మిస్తున్నామని…విదేశీ విద్యకు సాయం అందించామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.  పసుపు-కుంకుమ పథకానికి నిధులు విడుదల చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. రూ.2,175కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేశామని చెప్పారు. అయితే బ్యాంకుల్లో సిబ్బంది లేరని….నగదు లేదని డ్వాక్రా మహిళలను ఇబ్బంది పెట్టొద్దని అధికారులను ఆదేశించారు. అన్నదాత సుఖీభవ పథకానికి మార్గదర్శకాలు సిద్ధం చేశామన్నారు. కేంద్రం ఇవ్వని రైతులకు కూడా రాష్ట్రం ఇస్తోందని…కౌలు రైతులు, 5 ఎకరాలు పైబడిన రైతులకూ సాయం చేస్తున్నామని చెప్పారు. కౌలు రైతులకు రూ.9,654 కోట్ల పంటరుణాలు దేశంలోనే రికార్డు అని అన్నారు. ఈ పథకం ద్వారా 27 లక్షల మంది కౌలు రైతులకు ప్రయోజనం చేకూరుతుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
నదుల అనుసంధానంతో సత్ఫలితాలు..
నదుల అనుసంధానంతో సత్ఫలితాలు వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం నీరు-ప్రగతిపై సీఎం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సమర్ధ నీటి నిర్వహణతో అధిక దిగుబడులు వస్తున్నాయని, చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు చేరాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనులు 66శాతం పూర్తి అయ్యాయని చెప్పారు. 19 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయ్యిందని, మరో 4 ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. నీరు-చెట్టు, నీరు-ప్రగతికి అవార్డులు వచ్చాయన్నారు. ‘గ్లోబల్‌ ఎనర్జీ ఎన్విరాన్‌మెంట్‌ ఫౌండేషన్‌’ ఎ/-లాటినం అవార్డు లభించదని…ఈ అవార్డులే మన కృషికి కొలమానాలు అని చంద్రబాబు పేర్కొన్నారు.