టెక్ బీ – హెచ్ .సి.ఎల్ ఎర్లీ కెరీర్ ప్రోగ్రాంలో చేరి, నేర్చుకుంటూనే ఉద్యోగ అవకాశం..జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

 హన్మకొండ బ్యూరో 24ఆగస్టు జనంసాక్షి
ఇంటర్మీడియట్ పూర్తి చేసి టెక్నాలజీని కెరీర్ గా ఎంచుకుని, ఉపాధి కోరుకునే వారికి ఇది గొప్ప అవకాశమని ఆయన తెలిపారు. భారతదేశంలో నివసించే వారు, మేథ్స్/ బిజినెస్ మేథ్స్ లో 2021, 2022 ఇంటర్మీడియట్ బోర్డు పరీక్ష ఉత్తీర్ణులై, 60% ఓవరాల్,  60% గణితంలో మార్కులు పొందిన వారు దీనికి అర్హులన్నారు. సాప్ట్ వేర్ డెవలపర్, అనలిస్టు, డిజైన్ ఇంజనీర్, డేటా ఇంజనీర్, సపోర్ట్ & ప్రాసెస్ అసోసియేట్ తదితర ఉద్యోగాలు ఉంటాయని ఆయన తెలిపారు. టెక్ బీ ప్రోగ్రాంలో చేరిన విద్యార్థులకు శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత హెచ్సీఎల్  కంపెనీలో ‌ఫుల్ టైం ఉద్యోగులుగా నియామకం ఉంటుందని ఆయన అన్నారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా క్లాస్ రూమ్ ట్రైనింగ్ మరియు ఇంటర్న్షిప్ ఉంటాయని,  రూ. 10,000/- స్టెయిఫండ్ ఇవ్వబడునని ఆయన అన్నారు. ప్రోగ్రాం పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాన్ని బట్టి ఏడాదికి రూ. 2.2 లక్షల వేతనంతో కెరీర్ ప్రారంభం అవుతుందన్నారు. అనంతరం అభ్యర్థులు బిట్స్ పిలాని, శస్త్ర యూనివర్సిటీ అందించే గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంను చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ టెక్ బీ ఒక సంవత్సరం శిక్షణ కు అయ్యే రూ. 1.18 లక్షల ఫీజును ఎడ్యుకేషనల్ లోన్ ద్వారా చెల్లించే వెసులుబాటు హెచ్సిఎల్ కల్పిస్తుందన్నారు. ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వడానికి సంబంధించిన సెలక్షన్ డ్రైవ్ ఈ నెల 28 న, హెచ్సీఎల్ కంపెనీ ద్వారా   నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు
లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకొని 28న స్థానిక govt junior college, Hanamkonda bus stand హాజరు కావాలని కలెక్టర్ అన్నారు.
హాజరు సమయంలో  ఎస్ఎస్ సి, ఆధార్ కార్డ్ , ఇంటర్ మీడియట్,  Android mobile ధృవీకరణ లు వెంట తీసుకురావాలని ఆయన తెలిపారు. ఈ నెల 28, రిట్టెన్ ఎగ్జాం, ఇంటర్వ్యూ ఉంటాయని, అభ్యర్థులు ఉ. 9.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు అందుబాటులో ఉండాలని ఆయన అన్నారు.
ఇతర వివరాలకు 8555961573,
 6303 207 394 నెంబర్లను సంప్రదించాలని.
ఈ అవకాశాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.