టైగర్ రిజర్వ్‌డ్ ఫాారెస్టుల్లో పర్యాటకులను
అనుమతించొద్దు : సుప్రీం అదేశం
పులుల సంరక్షణ కేంద్రాలలో పర్యటకం వద్దు
న్యూఢిల్లీ, జూలై 24 : పులుల సంరక్షణ ప్రియులకు సుప్రీంకోర్టు చక్కటి శుభవార్త తెలియజేస్తూ ఆదేశాలు మంగళవారం నాడు జారీ చేసింది. ఇకపై పులుల సంరక్షణ కేంద్రాలలో పర్యటకులు పర్యటించే అవకాశాలు లేవు. పర్యటకుల వల్ల పులుల సహజత్వం లోపిస్తుందని తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయని భోపాల్‌కు చెందిన ఓ ఎన్‌జిఒ సంస్థ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేసింది. దీనిని విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు మంగళవారంనాడు ఈ ఆదేశాన్ని జారీ చేసింది. తాజా గణంకాల ప్రకారం దేశంలో పదిహేడు వందల పులులు ఉన్నాయి. వీటి సంరక్షణకు టైగర్‌సఫారీలు రీసార్టుల్లాంటి వాటితో పాటు బఫర్ జోన్‌లను ఏర్పాటు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. పులుల సంరక్షణ కేంద్రాల పరిసరాల్లో బఫర్ జోన్‌ల ఏర్పాటుపై నోటిఫికేషన్ ఇస్తూ అఫటవిట్ జారీ చేయ్యని రాష్ట్రప్రభుత్వాలకు పదివేల జరిమానా విధించింది. ఈ రాష్ట్రప్రభుత్వాల జాబితాలో మధ్యప్రదేశ్, తమిళనాడు, బీహార్, మహారాష్ట్రలతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఉండటం గమనార్హం.