ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు
నిమజ్జనాలు పూర్తయ్యే వరకు అమలు
మధ్యాహ్నం నుంచి వాహనాలకు అనుమతి నిరాకరణ
నిమజ్జనంతో పాటే వ్యర్థాల తొలగింపునకు రంగం సిద్దం
హైదరాబాద్,సెప్టెంబర్15(జనంసాక్షి): వినాయక నిమజ్జన ఊరేగింపుల నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌పై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. సందర్శకుల రద్దీ పెరగనున్న నేపథ్యంలో శనివారం నుంచి ఈనెల 22 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ట్యాంక్‌బండ్ చుట్టుపక్కల వాహనాల రాకపోకలపై ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని సిపి అంజనీకుమార్ తెలిపారు. దీంతో మధ్యాహ్నం తరవాత ట్యాంక్‌బండ్‌పై వాహనాలను దారిమళ్లించారు. లోయర్ ట్యాంక్‌బండ్ విూదుగా వహనాలు అనుమతించారు. కర్బలా మైదాన్ నుంచి వచ్చే వాహనాలను ట్యాంక్‌బండ్ విూదకి అనుమతించరు. ¬టల్ మారియట్ టి.జంక్షన్ వద్ద మళ్లిస్తారు. లిబర్టీ వరకు వెళ్లాల్సినవి కవాడిగూడ కూడలి విూదుగా గాంధీనగర్ టి.జంక్షన్.. డీబీఆర్ మార్గం విూదుగా ఇందిరాపార్కు .. లిబర్టీకి చేరుకోవాల్సి ఉటంఉంది.
ఖైరతాబాద్ వంతెన విూద నుంచి వచ్చే వాహనాలను ఎన్టీఆర్ మార్గంలోకి అనుమతించరు. ఇందిరాగాంధీ విగ్రహం నుంచి నెక్లెస్‌రోడ్ వైపు, ఐమాక్స్ విూదుగా మింట్ కాంపౌండ్ వైపు మళ్లిస్తారు. ఎన్టీఆర్ మార్గ్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వాహనాలను ఇక్బాల్ మినార్ మార్గానికి మళ్లిస్తారు. అక్కడి నుంచి తెలుగుతల్లి విగ్రహం జంక్షన్ విూదుగా కట్ట మైసమ్మ ఆలయం నుంచి డీబీఆర్ మార్గంలో సికింద్రాబాద్ వెళ్లాలి.
గోశాల నుంచి వచ్చే వాహనాలను డీబీఆర్ మార్గం.. ట్యాంక్‌బండ్‌పైకి రానివ్వరు. డీబీఆర్ మార్గంలో లోయర్‌ట్యాంక్ బండ్ విూదుగా మళ్లిస్తారు. ఇకపోతే నిమజ్జనానికి హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. హుస్సేన్‌సాగర్‌లో పేరుకుపోయే నిమజ్జన వ్యర్థాలను శనివారం నుంచే తొలగింపు పక్రియను చేపట్టారు. నిమజ్జనం చేయగానే.. అలా తొలగించేలా ఏర్పాట్లు చేశారు. భాగ్యనగరంలో ఈసారి కూడా భారీ సంఖ్యలో విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఖైరతాబాద్ గణపతి మొదలు బాలాపూర్ గణనాథుడు సహా వేలాది విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేసేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.సాగర్ రెండో దశ ప్రక్షాళన పనులు పట్టాలెక్కాయి. ఇప్పుడిప్పుడే కొంత ఫలితం కనిపిస్తోంది.ఈ తరుణంలో నిమజ్జన వ్యర్థాలు అలాగే ఉండిపోతే సమస్యగా మారే ప్రమాదముంది. నిమజ్జనం కారణంగా 4700 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు పేరుకుపోయే అవకాశముందని హెచ్‌ఎండీఏ అధికారులు అంచనా వేశారు. తొలగింపు పక్రియ బాధ్యతను ఓ గుత్తేదారుకు అప్పగించారు. మూడో రోజు నుంచి తొలగింపు పనులు ప్రారంభం కానున్నాయి. 28 జేసీబీలు.. వేయి మంది కూలీలు.. 60 మంది సూపర్‌వైజర్లు.. అత్యాధునిక యంత్రాలను మోహరించారు. ఆ వ్యర్థాలను టిప్పర్లు లోయర్ ల్యాంక్‌బండ్‌లోని జీహెచ్‌ఎంసీ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌కు చేరవేస్తాయి. అక్కడి నుంచి జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తారు.