డబుల్ బెడ్రూం ఇండ్లను త్వరితగతిన పూర్తి చేయాలి. వర్కింగ్ ప్రెసిడెంట్ పురుషోత్తం

గంగారం అక్టోబర్ 8 (జనం సాక్షి)
– పునాదుల వద్దనే డబుల్‌బెడ్‌రూం,
– ఏడు సంవత్సరాలైన పునాదులకే పరిమితం,
– ముందుకురాని కాంట్రాక్టర్లు,
– ఊగిసలాటలో లబ్దిదారులు,
గంగారం మండలం పోనుగొండ్ల గ్రామం లోని అగ్ని ప్రమాదంలో పూర్తిగా ధ్వంసమైన వారికి డబ్బులు బెడ్ రూమ్ ఇండ్లను ఇస్తానని టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి మంత్రి చందులాల్ హామీ ఇచ్చి పనులను కూడా ప్రారంభించినార్ అయినప్పటికీ రాష్ట్ర
ప్రభుత్వం అర్హులైన పేద ప్రజల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన డబుల్‌ బెడ్‌రూమ్‌ పథకం తీరు గంగారం మండలంలో ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్నట్టు తయారైంది. ఏడు ఏళ్లు గడుస్తున్నా. గంగారం మండలంలో ఏ ఒక్క డబుల్‌బెడ్‌రూం నిర్మాణం పూర్తికాలేదు. దీంతో లబ్దిదారులు తమకు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు వస్తాయా.లేక ఇంతేనా అని ఆందోళన చెందుతున్నారాని గంగారం మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పురుషోత్తం వాపోయారు. వాటి పనులు పునాది దశలోనే ఉన్నాయనీ. అవి ఎప్పటికి పూర్తవుతాయో, వాటిలోకి ఎప్పటికి తాము వెళ్తామోనని పేదలు కలలు కంటున్నారనీ
ఇలా ఇండ్లు మరింత ఆలస్యం అవుతుండడంతో పేద, మధ్య తరగతి ప్రజలు తమకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు వస్తాయా లేక ఇంకా పూరిగుడిసెల్లోనే నెట్టుకురావాలా అని అక్కడి పేదలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఊరించి ఉసూరుమనిపిస్తోందని, ఇంకా తాము ఇండ్ల కోసం ఊహల పల్లకిలోనే ఉంటున్నామని, త్వరగా తమ కల నెరవేర్చాలని కలెక్టర్ ప్రత్యేక చొరవతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తి చేయించాలని బాధిత కుటుంబాలు వేడుకున్నారు.