డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులు వేగవంతం చేయాలి

పూర్తయిన  ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయాలి
రెండు పడక గదుల నిర్మాణాలకు అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించాలి
లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితా సిద్దం చేయాలి
…. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్
సంగారెడ్డి టౌన్ జనం సాక్షి
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని, పూర్తయిన ఇండ్లు ఆగస్టు మొదటి వారంలో ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శర త్ సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలకు ఆదేశించారు.
 కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో హౌసింగ్ నోడల్ అధికారి, సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ లతో రెండు పడక గదుల నిర్మాణాల పనుల పురోగతి, మౌళిక సౌకర్యాల ఏర్పాటు, సైట్ వారీగా పూర్తయిన ఇండ్లు, వివిధ దశలో ఉన్నవి, మౌలిక వసతులు కల్పించాల్సినవి, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఇండ్లు తదితర అంశాలను  సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్తయిన ఇండ్లను ఆగస్ట్ మొదటి వారంలో ప్రారంభించడానికి  సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా వివిధ దశల్లో ఉన్న ఇండ్ల పనులను నెల లోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని ఇండ్ల ఇన్ఫ్రా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
జిల్లాలో ఆయా సైట్లలో చేపట్టిన నిర్మాణాలు, పూర్తి అయినవి , పూర్తి అయిన ఇండ్లలో మౌలిక సౌకర్యాల కల్పన వివరాలు సమర్పించాలని,  కొనసాగుతున్న పనులు ఏ దశలో  ఉన్నాయన్న వివరాల నివేదికను స్పష్టంగా అందజేయాలని హౌసింగ్ నోడల్ అధికారికి సూచించారు. పనుల వేగవంతానికి ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీల తో కోఆర్డినేషన్ చేసుకోవాలని సూచించారు. పనులు నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉండాలన్నారు. పెండింగ్ పనులకు సంబంధించి స్టేజి వారీగా పనుల నివేదిక ఇవ్వాలని ఏజెన్సీ లకు ఆదేశించారు.
లబ్ధిదారులకు అందించడానికి వివిధ దశల్లో ఉన్న ఇండ్లను వేగవంతంగా పూర్తి చేయాలని ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలకు ఆదేశించారు.
లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితా సిద్ధం చేయాలని, పూర్తయిన ఇండ్లను ప్రారంభించడానికి సిద్ధం చేయాలని హౌసింగ్ నోడల్ అధికారి మరియు డి సి ఓ తుమ్మ ప్రసాద్ కు సూచించారు.
ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, హౌసింగ్ నోడల్ అధికారి తుమ్మ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలు ఆర్ అండ్ ఈ ఈ సురేష్, పంచాయతీరాజ్ ఈ ఈ జగదీశ్వర్, ఆర్డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు.
Attachments area