డాక్టర్ మౌనిక కోడేరు ఆధ్యర్యంలో రాజాపురం గ్రామంలో వైద్య శిబిరం.
కోడేరు (జనం సాక్షి) సెప్టెంబర్ 29 కోడేరు మండల పరిధిలోని రాజాపూర్ గ్రామంలో శుక్రవారం రోజు డాక్టర్ మౌనిక ఆధ్వర్యంలో సీజన్ వ్యాదుల నివారణ కొరకు,బిపి,టీబి,క్షయ, వ్యాది, లక్షణాలు 2 వారాల నుంచి దగ్గు,బరువు తగ్గడం,ఆకలి మందగించడం,సాయంత్రం పూట జ్వరం రావడం,ఇటువంటి వారు తక్షణమే తెమడ పరిక్షలు చేయించుకోవాలని కోడేరు డాక్టర్ మౌనిక తెలిపారు,రాజాపురం గ్రామంలో 10 మంది శాంపిల్స్ ను తీసుకోవడం జరిగింది.అదేవిధంగా గ్రామంలో వివిధ రకాల రోగాలకు పరిక్షలు చేసి వారికి ట్యాబ్లేట్లు,మందులు ఇవ్వడం జరిగింది.డాక్టర్ మౌనిక తో పాటు డాక్టర్ జ్ఞానేశ్వర్, నారాయణ (ల్యాబ్ టెక్నీషియన్) టీ బి షుగర్, ముక్తార్, అహ్మద్, మరియు ఎఎన్ఎం, శాంతమ్మ, ఎఎన్ఎం,శ్రీదేవి, సుభద్ర,సంతోష, మరియు గ్రామంలోని ఆశా కార్యకర్తలు ప్రజలు తదీతరులు పాల్గొన్నారు.