డాక్టర్ రవీంద్రమోహన్ కు విశ్వగురు వరల్డ్ రికార్డ్
ఎల్ బి నగర్, జులై4 (జనం సాక్షి ) జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఆధ్వర్యములో ఎక్సి లెన్స్ సర్వీసెస్ ఆఫ్ హ్యూమానిటి అవార్డ్ ప్రశంసా పత్రాన్ని ఎల్ బి నగర్ మహల్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, కరస్పాండెంట్ డాక్టర్ ఎ రవీంద్రమోహన్ అందుకున్నారు . వరల్డ్ రికార్డ్ ని కూకట్ పల్లిలోని భారత్ వికాస్ పరిషత్ లో ఎర్పాటుచేసిన అవార్డు పధానోత్సవ కార్యక్రమములో విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ చైర్మెన్ సత్యవోలు రాంబాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన జాతీయ డాక్టర్స్ డే కార్యక్రమానికి ముఖ్యాతిధులుగా విచ్చేసిన తెలంగాణ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పెరుగు శ్రీసుధ కరకమలములచే అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రవీంద్ర మోహన్ సేవలకు వారు అభినందలు తెలియజేస్తూ విశ్వగురువరల్డ్ రికార్డ్ ని అందజేయడం జరిగింది. పేదల పాలిట ప్రత్యక్షదైవంగా ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితులల్లో వారు చేసిన సేవలకు గాను ఈ అవార్డు ను జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా అంతర్జాతీయ ఎక్సిలెన్స్ ఆఫ్ హ్యూమానిటి గొప్ప మానవతా సేవకులుగా గుర్తించి వారికి అవార్డ్ ని అందజేయడం జరిగిందని వివరి సంస్థ చైర్మెన్ సత్యవోలు రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత డాక్టరె రవీంద్రమోహన్ మాట్లాడుతూ వృత్తి ధర్మానికి ప్రాధాన్యత నిస్తూ ఒక డాక్టర్ గా ఎందరికో క్లిస్టపరిస్థితులల్లో ధైర్యమిచ్చి కోలుకునేలా చేయగలిగితే వారు వారి కుటుంబసభ్యుల కళ్ళలో కనిపించే కృతజ్ఞతాభావానికి వెలకట్టలేమని మానవత్వంతో సేవలందిస్తే మాధవలవలె గొప్పవిగా ఆ సేవలు మరువలేనివన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లవ్ ఆఫ్ ప్రగతి క్లబ్ ప్రతినిధులు లయన్ డాక్టర్ ఎం ప్రేమ కుమార్, లయన్ డి కోటేశ్వరరావ్, లయన్ డి వేంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.