డాల్ఫినేరియంలకు అనుమతులొద్దు : రాష్ట్రాలకు పర్యావరణ శాఖ ఆదేశాలు

న్యూఢిల్లీ : వినోదం కోసమో, పరిశోధన కోసమో డాల్ఫిన్లను బంధించి ఉంచే డాల్ఫినే రియలంకు అనుమతులు ఇవ్వవద్దని పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారుల కమిటీ రాష్ట్రాలను ఆదేశించింది. వాటి సహజ జీవనరీతికి భిన్నంగా డాల్ఫిన్లను ఇలా బంధించడం పట్ల జంతువుల హక్కుల పరిరక్షణ సంస్థలు లేవనెత్తిన పలు అంశాల నేపథ్యంలో మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఎంతో క్రూరమైన పద్థతిలో వేటాడి డాల్ఫిన్లను నిర్భంధంలోకి తీసుకుంటున్నారని జంతువుల హక్కుల కార్యకర్తలు  ఆరోపిస్తున్నారు. డాల్ఫినేరియంల ఏర్పాటుకు అనుమి కోరుతూ ఇటీవల కోచి, నోయిడా, సింధుదుర్గ్‌ల నుంచీ దరఖాస్తులు వచ్చినట్లు పర్యావరణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.