డిఎస్సీ కోసం విద్యార్థుల ఆందోళన
ఏలూరు,అక్టోబర్13(జనంసాక్షి): పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో డిఇడి-బిఇడి విద్యార్థులు శనివారం ఆందోళనకు దిగారు. వెంటనే డిఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాగే రాస్తారోకో నిర్వహించారు. అనంతరం మానవహారం చేపట్టారు. చింతలపూడి వైసిపి సమన్వయకర్త విఆర్.ఎలీజా విద్యార్థులకు మద్దతు ప్రకటించారు. ఎస్‌జిటి పోస్టులు పెంచాలని, డిఎస్సీ నోటిఫికేషన్ త్వరితగతిన ఇవ్వాలని విద్యార్థులంతా నినాదాలు చేశారు. 2018 మెగా డిఎస్సీగా నిర్వహించాలని కోరారు. ఖాళీగా ఉన్న 23 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.