డీఎల్‌ బర్తరఫ్‌ బాధాకరం : మర్రి శశిధర్‌ రెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): మంత్రివర్గం నుంచి డీఎల్‌ రవీంద్రారెడ్డి బర్తరఫ్‌ బాధాకరమని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి అన్నారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ రాజీనామాకు అనుమతించాలని కోరినా డీఎల్‌ను బర్తరఫ్‌ చేయటం సరికాదన్నారు. డీఎల్‌ బర్తరఫ్‌ హైకమాండ్‌ అనుమతి ఉందని తాను అనుకోవటం లేదని మర్రి శశిధర్‌ రెడ్డి అన్నారు.