డెంటల్ విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్,సెప్టెంబర్18(జనంసాక్షి): హైదరాబాద్ నగరంలోని సరూర్నగర్ పీఎస్ పరిధి మాదన్నపేటలో డెంటల్ విద్యార్థి అసిమ్ (33) ఆత్మహత్య కలకలం రేపుతోంది. కాలేజీ యాజమాన్యం వేధింపులే కారణమంటూ అసిమ్ సూసైడ్ నోట్లో పేర్కొంది. దీంతో అసిమ్ ఆత్మహత్యకు నిరసన చైతన్యపురిలోని కాలేజీ ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళనకు దిగారు. యాజామాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఆసిమ్ ఆత్మహత్యకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.