డోర్నకల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కోటాలో కేవలం సిసి రోడ్లకే 18 కోట్లు – 25 కోట్లతో ఆకేరు వాగు పై వంతెన

డోర్నకల్, ఆగస్టు-11,జనం సాక్షి న్యూస్: డోర్నకల్ నియోజవర్గానికి ఎమ్మెల్యే కోటాలో కేవలం సిసి రోడ్లకే 18 కోట్లు మంజూరు చేయడం జరిగిందని డోర్నకల్ శాసనసభ్యులు డిఎస్ రెడ్యా నాయక్ అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలంలోని చిలుకోయాలపాడు, అందనాలపాడు, మోదుగడ్డ తండా, మన్నెగూడెం గ్రామాలలో పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్స, శంకుస్థాపనలు చేసిన శాసనసభ్యులు డిఎస్ రెడ్యా నాయక్. ప్రతి గ్రామ గ్రామాన డిజె సప్పట్లు,ఆటపాటలు, కోలాటాలతో ఎమ్మెల్యే రెడ్యానాయక్ కు మహిళలు గ్రామ ప్రజలు భారీగా స్వాగతం పలికారు. 25 కోట్ల రూపాయలతో మున్నేరు వాగుపై వంతెన, రెండు కోట్ల 50 లక్షలతో చిలుకోయాలపాడు నుండి అందనాలపాడు గ్రామానికి బీటీ రోడ్డు శంకుస్థాపన అదేవిధంగా పలు గ్రామాల్లో సిసి రోడ్లు, పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవ శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే రెడ్యా నాయక్. అనంతరం పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమ ప్రభుత్వ దేహమని, మన రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి, రైతుబంధు, రైతు బీమా, నేతన్న, గౌడన్న బీమాలు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఆసరా పింఛన్లు ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో ఎక్కడలేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని ఎమ్మెల్యే రెడ్యా అన్నారు.ప్రతి గ్రామానికి,తండాలకు గృహలక్ష్మి పథకం కింద డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తామని, ప్రతి గ్రామాల్లో అభివృద్ధి కొరకు సిసి రోడ్లను నిర్మిస్తామని, ప్రతి గ్రామానికి దళిత బంధు, బీసీ బందు వచ్చే విధంగా చూస్తామని శాసనసభ్యుడు రెడ్యా నాయక్ సభ ముఖంగా తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ డోర్నకల్ మండల అధ్యక్షుడు నున్న రమణ, జడ్పిటిసి కమల రామనాథం, ఎంపీపీ డిఎస్ బాలునాయక్, సొసైటీ చైర్మన్ లు సిహెచ్ బిక్షం రెడ్డి, కొండపల్లి సీతారాం రెడ్డి, మాజీ జెడ్పిటిసి గొర్ల సత్తిరెడ్డి, మానుకోట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విద్యాసాగర్, మున్సిపల్ చైర్మన్ వీరన్న, మండల యూత్ అధ్యక్షుడు ఆంగోత్ హరీష్, ఎంపీటీసీలు లీలా రమేష్,నంజ్యల నాగమణిమధు,బొజ్జ నాయక్, విజయ పాల్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు ఆంగోత్ మోహన్, రమేష్,నాగంటి ఉపేంద్ర,రాంప్రసాద్,మహిళ అధ్యక్షురాలు హైమావతి, ఎంపీడీవో అపర్ణ, తాసిల్దార్ నిమ్మ తోట నాగ భవాని,ఎంపీఓ మున్వర్ బేగ్, బోయిన రంజిత్, లచ్చు, ప్రజా ప్రతినిధులు,అధికారులు, పలు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు